అమరావతి: రాష్ట్రంలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వారం రోజుల్లో విడుదల చేసేందుకు పాఠశాల విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. ఎస్సీ వర్గీకరణ రోస్టర్ పాయింట్లపై గవర్నర్ ఆమోదంతో జారీ అయ్యే ఆర్డినెన్స్ ఆధారంగా టీచర్ పోస్టులు కేటాయిస్తారు. వర్గీకరణ ఆర్డినెన్స్ కోసం ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. రెండు మూడు రోజుల్లో ఫైలు రాజ్‌భవన్‌కు పంపుతారని సమాచారం. ఆర్రడినెన్స్ జారీ అయిన తర్వాతి రోజే నోటిఫికేషన్ ఇస్తారని సమాచారం.
ముందుగా చెప్పినట్టు 16,347 పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్ చేసి, విద్యా సంవత్సరం ప్రారంభం అయ్యేలోగా ప్రక్రియ పూర్తి చేస్తారని అధికార వర్గాలు తెలిపాయి. నోటిఫికేషన్ విడుదల అయిన తర్వాత పరీక్షలకు కనీసం 45 రోజుల సమయం ఉండే అవకాశం ఉండనుంది. మొత్తం పోస్టుల్లో ఎస్‌జీటీలు 6,371, స్కూల్ అసిస్టెంట్లు 7,725, టీజీటీలు 1781, పీజీటీలు 286, ప్రిన్సిపల్ పోస్టులు 52, పీఈటీలు 132 పోస్టులు ఉన్నాయి. ఇటీవలే అసెంబ్లీలో త్వరలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని మంత్రి లోకేష్ ప్రకటన చేశారు. మెగా డీఎస్సీని పారదర్శకంగా నిర్వహిస్తామని తెలిపారు.