ఏపీ సర్కార్ కీలక నిర్ణయం, ప్రభుత్వ సలహాదారులుగా నిష్ణాతులైన వారు నియామకం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివిధ రంగాల్లో నిష్ణాతులైన వారిని ప్రభుత్వ గౌరవ సలహాదారులుగా నియమించింది.
By Knakam Karthik
ఏపీ సర్కార్ కీలక నిర్ణయం, ప్రభుత్వ సలహాదారులుగా నిష్ణాతులైన వారు నియామకం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివిధ రంగాల్లో నిష్ణాతులైన వారిని ప్రభుత్వ గౌరవ సలహాదారులుగా నియమించింది. స్పేస్ టెక్నాలజీకి ఇస్రో మాజీ ఛైర్మన్ సోమనాథ్, డీఆర్డీవో మాజీ చీఫ్ సతీష్‌రెడ్డి, భారత్ బయోటెక్ ఎండీ సుచిత్ర ఎల్ల, కేపీసీ గాంధీలను కేబినెట్ హోదాతో సలహాదారులుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. కేబినెట్ ర్యాంక్ హోదాతో రెండేళ్లు పదవిలో కొనసాగుతారని ఉత్తర్వులలో పేర్కొంది.
ఆంధ్రప్రదేశ్ స్పేస్ టెక్నాలజీ గౌరవ సలహాదారుగా ఇస్రో మాజీ చీఫ్ సోమనాథ్ ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ లో పనిచేస్తున్న సోమనాథ్ కు పాలనా వ్యవహారాలు, పరిశ్రమలు, పరిశోధనలో సలహాలు ఇవ్వాలని ప్రభుత్వం కోరింది. స్మార్ట్ సిటీస్, డిజాస్టర్ మేనేజ్ మెంట్లో స్పేస్ టెక్నాలజీని అనుసంధానించాలని ప్రభుత్వం కోరింది. భారత్ బయోటెక్ ఎండీ సుచిత్ర ఎల్లాను సలహాదారుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. చేనేత, హస్తకళల అభివృద్ధికి సంబంధించి గౌరవ సలహాదారుగా నియామకం చేసింది. ఏపీ ఫోరెన్సిక్ గౌరవ సలహాదారుగా కేవీపీ గాంధీని నియమించింది. ఏపీ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ గౌరవ సలహాదారుగా కేవీపీ గాంధీ నియామకం జరిగింది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివిధ రంగాల్లో నిష్ణాతులైన వారిని ప్రభుత్వ గౌరవ సలహాదారులుగా నియమించింది.ఏరోస్పేస్, డిఫెన్స్ పరిశోధన, తయారీ రంగంలో ప్రపంచస్థాయి కేంద్రంగా ఆంధ్రప్రదేశ్‌ను తయారు చేయడానికి సతీష్ రెడ్డి మార్గదర్శకత్వం వహించాల్సి ఉంటుంది. పారిశ్రామికవేత్తలు, పరిశోధనా సంస్థలు, ప్రభుత్వ రంగంలోని రక్షణ సంస్థలతో సమన్వయం చేసుకుంటూ ప్రాజెక్టులు కూడా చేపట్టాల్సి ఉంటుంది.
చేనేతకు మార్కెట్ ను పెంచడంతో పాటూ దేశీయ, అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షిస్తూ.. కళాకారులు, సహకార సంస్థలు, ఎంఎస్‌ఎంఈలకు మద్దతిచ్చేలా సుచిత్ర ఎల్లా పని చేయాల్సి ఉంటుంది. హస్తకళల రంగాల సుస్థిరత, బలోపేతం, అభివృద్ధికి అవసరమైన సలహాలు..జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అమలు చేస్తున్న విధానాలను సూచించాలి.
రాష్ట్రంలో ఫోరెన్సిక్ మౌలిక వసతులు, మానవ వనరులను మెరుగుపరిచేందుకు నిధులు రాబట్టడం..ఫోరెన్సిక్ సైన్స్ రంగంలో ప్రపంచంలో అమల్లో ఉన్న అత్యుత్తమ విధానాలు ఆచరణలో పెట్టడం చేయాలి. నేరగాళ్ల ప్రొఫైలింగ్, అనుమానితుల గుర్తింపునకు వీలుగా ఫోరెన్సిక్ డేటా ఇంటిగ్రేషన్‌కుకేీసీ గాంధీ సహకారం అందించాలి.
పరిపాలన, పారిశ్రామిక, పరిశోధన రంగాల్లో స్పేస్ టెక్నాలజీని వినియోగించుకోవటానికి అనువుగా అవసరమైన విధానాల రూపకల్పనకు సలహాలివ్వడమే కాకుండా.. అడ్వాన్స్‌డ్ స్పేస్ టెక్నాలజీ హబ్‌లు, టెస్టింగ్ సదుపాయాలు, రీసెర్చ్ సెంటర్ల ఏర్పాటుపై సోమనాథ్ మార్గదర్శకత్వం వహించాలి. వీటతో పాటూ జీఐఎస్, శాటిలైట్ నేవిగేషన్, ఏఐ ఆధారిత స్పేస్ ఎనలిటిక్స్ వినియోగం మరింత పెరిగేలా చూడాలి.