రూ. 2,56,256 కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టిన మంత్రి బుగ్గన
Andhrapradesh budget 2022-23 highlights. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. అసెంబ్లీలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బడ్జెట్‌ను ప్ర
By అంజి Published on 11 March 2022 5:40 AM GMTఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. అసెంబ్లీలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. తిరువల్లూరు సూక్తులతో మంత్రి బుగ్గన బడ్జెట్ ప్రసంగం ప్రారంభించారు. విపత్తును ఎదుర్కొన్నప్పుడే మన సామర్థ్యం తెలుస్తుందని బుగ్గన పేర్కొన్నారు. మేనిఫెస్టో హామీలు, నవరత్నాలకు బడ్జెట్‌లో ప్రాధాన్యత కల్పించామన్నారు. ప్రజలకిచ్చిన హామీల దిశగా బడ్జెట్ రూపొందించామన్నారు. ప్రధాన రంగాలకు బడ్జెట్ కేటాయింపులు జరిగాయన్నారు. మధ్య మధ్యలో గురజాడ అప్పారావు, శ్రీశ్రీ కవితలను చదువుతూ ప్రసంగం వినిపించారు. వెనుకబడిన వర్గాల అభివృద్ధి కోసం రెండింతలు కేటాయింపులు చేసినట్లు తెలిపారు. సీఎం జగన్ ప్రభుత్వం కరోనా మహమ్మారి వంటి విపత్తు సమయంలోనూ ప్రజలకు సంక్షేమ ఫలాలను అందించిందని మంత్రి బుగ్గన అన్నారు. రూ.2,56,256 కోట్లతో వార్షిక బడ్జెట్‌ను ప్రవేశ పెట్టారు. ఇందులో రెవెన్యూ వ్యయం రూ.2,8,261 కోట్లు కాగా, క్యాపిటల్ వ్యయం రూ.47,996 కోట్లు, రెవెన్యూ లోటు రూ. 17, 036 కోట్లు, ద్రవ్య లోటు రూ. 48, 724 కోట్లు, జీఎస్‌డీపీ రెవెన్యూ లోటు 1.27 శాతంగా బడ్జెట్‌లో పొందుపర్చారు.
ఏపీ బడ్జెట్ కేటాయింపుల పూర్తి వివరాలు
వ్యవసాయం: రూ. 11,387.69 కోట్లు.
పశుసంవర్ధకం: రూ. 1568.83 కోట్లు.
బీసీ సంక్షేమం: రూ. 20,962.06 కోట్లు
పర్యావరణ, అటవీ: రూ. 685.36 కోట్లు.
ఉన్నత విద్య: రూ. 2,014.30 కోట్లు.
విద్యుత్: రూ. 10,281.04 కోట్లు.
సెకండరీ ఎడ్యుకేషన్: రూ. 27,706.66 కోట్లు.
ఎకానమికల్ బ్యాక్ వర్డ్: రూ. 10,201.60 కోట్లు.
సివిల్ సప్లైస్: రూ. 3,719.24 కోట్లు.
ఫైనాన్స్: రూ. 58,583.61 కోట్లు
జీఏడీ: రూ. 998.55 కోట్లు.
సచివాలయ వ్యవస్థ: రూ. 3,396.25 కోట్లు
వైఎస్సార్ పెన్షన్ కానుక రూ. 18 వేల కోట్లు కేటాయింపు
వైఎస్సార్ రైతు భరోసా రూ. 3,900 కోట్లు కేటాయింపు
పాల ఉత్పత్తి, పశుసంవర్ధక శాఖ, మత్యశాఖకు రూ.1568 కోట్లు
ఉన్నత విద్యకు రూ. 2,014 కోట్లు కేటాయింపు
ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు రూ. 10, 201 కోట్లు కేటాయింపు
వెనుకబడిన వర్గాల అభివృద్ధికి రెండింతలు కేటాయింపులు పెంపు
వెనుకబడిన వర్గాల అభివృద్ధికి రూ. 20,962 కోట్లు
వ్యవసాయం మార్కెటింగ్, సహకారశాఖకు రూ. 11,387 కోట్లు