Andhrapradesh: రైతులకు అలర్ట్‌.. ముగుస్తోన్న ఈ -క్రాప్‌ నమోదు గడువు

ఆంధ్రప్రదేశ్‌లో ఖరీఫ్‌ సీజన్‌ పంటలకు సంబంధించి ఈ- క్రాప్‌ నమోదు గడువు ఈ నెల 30వ తేదీతో ముగియనుంది.

By అంజి  Published on  27 Sep 2024 1:46 AM GMT
Andhrapradesh, farmers, E-Crop registration

Andhrapradesh: రైతులకు అలర్ట్‌.. ముగుస్తోన్న ఈ -క్రాప్‌ నమోదు గడువు 

ఆంధ్రప్రదేశ్‌లో ఖరీఫ్‌ సీజన్‌ పంటలకు సంబంధించి ఈ- క్రాప్‌ నమోదు గడువు ఈ నెల 30వ తేదీతో ముగియనుంది. ముందుగా నిర్ణయించిన ఖరీఫ్‌ సీజన్‌ పంటలకు ఈ - క్రాప్‌ బుకింగ్‌ సెప్టెంబర్‌ 15వ తేదీతో ముగియగా.. పలుచోట్ల పంటలు నమోదు చేయాల్సి ఉన్నందున గడువును మరో 15 రోజులు పొడిగించారు. అది ఈ నెలాఖరుతో ముగుస్తుంది. పంటల బీమాతో పాటుగా, ఇన్‌ఫుట్‌ సబ్సిడీ, పంట కొనుగోలుకు ఈ క్రాప్‌ తప్పనిసరి.

'పంట బీమా పథకం' ప్రకృతి వైపరీత్యాల సమయంలో పంట నష్టపోయిన రైతులకు అండగా నిలుస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఈ పథకాన్ని అమలు చేస్తున్నాయి. ఈ - క్రాప్‌, ఈ - కేవైసీ ప్రక్రియలో భాగంగా రైతులు ఎంత భూమిలో ఏ పంట పండిస్తున్నారన్న వివరాలను వ్యవసాయ శాఖ సిబ్బందికి తెలియజేయాలి. అప్పుడు వ్యవసాయ శాఖ సిబ్బంది పొలాల వద్దకు వెళ్లి పంట నమోదుతో ఈ -కేవైసీ చేస్తారు. రైతు ఆధార్‌, మొబైల్‌ నంబర్‌, పొలం సర్వే నంబర్‌తో పాటు పొలం వద్ద ఫొటోలు తీసి యాప్‌లో అప్‌లోడ్‌ చేస్తారు. పంట నమోదు పూర్తైన తర్వాత ఈ - కేవైసీకి వేలిముద్రలు తీసుకుంటారు. ఈ క్రాప్‌, ఈ కేవైసీ పూర్తి అయిన వారికి మాత్రమే పంటల బీమా, ఇన్‌ఫుడ్‌ సబ్సిడీ వర్తిస్తుందని ప్రభుత్వం తెలిపింది.

Next Story