Andhrapradesh: రేపటి నుంచి స్కూళ్లలో ఆధార్‌ స్పెషల్‌ క్యాంప్‌లు

రాష్ట్రంలోని స్కూళ్లలో రేపటి నుంచి ఈ నెల 26 వరకు ప్రత్యేక ఆధార్‌ క్యాంపులను ప్రభుత్వం నిర్వహించనుంది. 5 నుంచి 15 ఏళ్ల పిల్లలు వారి బయోమెట్రిక్‌, పేరు..

By -  అంజి
Published on : 16 Nov 2025 4:10 PM IST

Andhrapradesh, Aadhaar special camps, schools, Aadhaar services

Andhrapradesh: రేపటి నుంచి స్కూళ్లలో ఆధార్‌ స్పెషల్‌ క్యాంప్‌లు

అమరావతి: రాష్ట్రంలోని స్కూళ్లలో రేపటి నుంచి ఈ నెల 26 వరకు ప్రత్యేక ఆధార్‌ క్యాంపులను ప్రభుత్వం నిర్వహించనుంది. 5 నుంచి 15 ఏళ్ల పిల్లలు వారి బయోమెట్రిక్‌, పేరు, అడ్రస్‌, డేట్‌ ఆఫ్‌ బర్త్‌ తదితర వివరాలను అప్డేట్‌ చేసుకునేందుకు వీలు ఉంటుంది. విద్యార్థుల వెంట పేరెంట్స్‌ వారి ఆధార్‌ కార్డును తీసుకెళ్లాలి. కాగా రాష్ట్రంలో ఇప్పటికీ 15.46 లక్షల మంది పిల్లల ఆధార్‌ బయోమెట్రిక్‌ అప్డేట్‌ చేసుకోవాల్సి ఉందని అధికారులు తెలిపారు.

గ్రామ, వార్డు సచివాలయాల శాఖ ఆధ్వర్యంలో ఆధార్‌ స్పెషల్‌ క్యాంప్‌లు నడవనున్నాయి. మేరకు ఆ శాఖ డైరక్టర్ శివప్రసాద్ బుధవారం కలెక్టర్లకు లెటర్‌ రాశారు. రాష్ట్రంలో సచివాలయాల వ్యవస్థ ఏర్పాటు తర్వాత నాలుగేళ్లుగా మారు మూల ప్రాంతాల్లోనూ ఆధార్ సేవలు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే.

రేపటి నుంచి పిల్లల ఆధార్‌ కార్డులను అప్‌డేట్‌ చేయించాలి తల్లిదండ్రులకు అధికారులు సూచిస్తున్నారు. ఒకవేళ పిల్లల ఆధార్ అప్డేట్ లేకపోతే పలు ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు పొందడంలో ఇబ్బందులు ఎదురయ్యే ఛాన్స్‌ ఉంది. పిల్లల బయోమెట్రిక్‌ అప్డేట్‌ పూర్తిగా ఉచితం, ఎలాంటి డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు. చిన్నారుల‌కు ఆధార్ బయోమెట్రిక్ కు సంబధిత డాక్యుమెంట్లను తీసుకెళ్లాలి. చిన్నారులను ఆధార్ సెంట‌ర్‌కు తీసుకెళ్లే వారి (త‌ల్లి లేదా తండ్రి) ఆధార్ కార్డును త‌ప్ప‌నిస‌రిగా తీసుకెళ్లాలి. క్యాంప్‌లో పిల్లల ఫోటో, ఫింగర్ ప్రింట్, ఐరిస్ అప్ డేట్ అవుతాయి. ఆధార్ లో మీ పేరు, చిరునామా లేదా పుట్టిన తేదీని అప్డేట్ చేయాల్సి వస్తే సరిచేసుకునే వీలు ఉంటుంది.

Next Story