గ్యాస్ కొరత నుంచి ఊరట..ఏపీలో రేపటి నుంచే కిరోసిన్ పంపిణీ

ఆంధ్రప్రదేశ్‌లోని రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం కీలక ఊరటనిచ్చింది.

By -  Knakam Karthik
Published on : 22 March 2026 8:29 PM IST

AndhraPradesh, Ration Card, Kerosene Supply, LPG Shortage, AP Govt

గ్యాస్ కొరత నుంచి ఊరట..ఏపీలో రేపటి నుంచే కిరోసిన్ పంపిణీ

ఆంధ్రప్రదేశ్‌లోని రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం కీలక ఊరటనిచ్చింది. ప్రస్తుత గ్యాస్ కొరతను దృష్టిలో ఉంచుకుని, ముఖ్యంగా గ్రామీణ మరియు గిరిజన ప్రాంతాల్లోని లబ్ధిదారులకు రేపటి (సోమవారం) నుంచి లీటర్ చొప్పున కిరోసిన్ పంపిణీ చేయాలని నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఆంధ్రప్రదేశ్‌కు 2,800 కిలో లీటర్ల (అంటే 28 లక్షల లీటర్లు) కిరోసిన్‌ను కేటాయించింది.

వాస్తవానికి ఆంధ్రప్రదేశ్‌ను గతంలోనే 'కిరోసిన్ రహిత రాష్ట్రం'గా ప్రకటించినప్పటికీ, ప్రస్తుతం నెలకొన్న ఇంధన సంక్షోభం మరియు గ్యాస్ సరఫరాలో తలెత్తిన అంతరాయాల దృష్ట్యా ప్రజలకు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం మళ్లీ ఈ సరఫరాను పునరుద్ధరించింది. గిరిజన ప్రాంతాల్లో వంట చెరుకుపై ఆధారపడే వారికి మరియు మారుమూల గ్రామాల్లోని పేదలకు ఈ నిర్ణయం పెద్ద ఊరటనివ్వనుంది. సంబంధిత రేషన్ దుకాణాల ద్వారా ఈ పంపిణీ ప్రక్రియను రేపటి నుండి పారదర్శకంగా చేపట్టాలని అధికారులను మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదేశించారు.

Next Story