అమరావతి: రేషన్‌కార్డు దారులకు బిగ్ అలర్ట్. రేషన్ స్మార్ట్ కార్డుల ఉచిత పంపిణీ ప్రక్రియకు గడువు దగ్గర పడింది. స్మార్ట్ రేషన్ కార్డులు తీసుకోని వారు వెంటనే తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. గ్రామ/వార్డు సచివాలయాల నుంచి క్యూఆర్ కోడ్‌తో కూడిన రేషన్ స్మార్ట్ కార్డులు ఉచితంగా తీసుకోవడానికి రేప ఆఖరు తేదీ. ఇంకా ఒక్క రోజు మాత్రమే సమయం ఉండడంతో తీసుకోనివారు వెంటనే తీసుకోవాలని ప్రభుత్వం రేషన్ కార్డుదారులకు విజ్ఞప్తి చేసింది. గడువులోగా కార్డులు తీసుకోకపోతే కార్డులు కమిషనరేట్‌కు వెనక్కి వెళ్లిపోతాయని అధికారులు చెబుతున్నారు.
కొంతమంది ఇతర ప్రాంతాలకు వలస వెళ్లడం వంటి ఇతర కారణాల వల్ల సిబ్బంది ఇంటింటికీ తిరిగినా కార్డులను అందించలేకపోయారని తెలుస్తోంది. మరోవైపు కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి కార్డు మంజూరు కాగా ఈ నెల నుంచే రేషన్ ఇస్తున్నారు. కానీ వీరికి స్మార్ట్ కార్డులు రాలేదు. గడువు ముగుస్తుండడంతో తమ కార్డుల పరిస్థితి ఏమిటని వారు ఆందోళన చెందుతున్నారు. ఇదిలా ఉంటే.. రేషన్ కార్డుదారులకు నిత్యావసర సరుకుల పంపిణీలో కీలక మార్పులు చేసేందుకు నిర్ణయించింది. వచ్చే జనవరి నుంచి రేషన్ దుకాణాల ద్వారా గోధుమపిండి, రాగులు కూడా అందించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నిర్ణయంతో పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక ఊరట కలగనుంది.