AP: టెన్త్, ఇంటర్ పరీక్షల షెడ్యూల్.. పూర్తి వివరాలు ఇవే
ఏపీలో పది, ఇంటర్మీడియట్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. మార్చి నెలలో పది, ఇంటర్ పరీక్షలు నిర్వహించబోతున్నట్లు ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స వెల్లడించారు.
By అంజి Published on 15 Dec 2023 3:04 AM GMTAP: టెన్త్, ఇంటర్ పరీక్షల షెడ్యూల్.. పూర్తి వివరాలు ఇవే
2023-24 విద్యా సంవత్సరానికి గానూ ఏపీలో పది, ఇంటర్మీడియట్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. మార్చి నెలలో పది, ఇంటర్ పరీక్షలు నిర్వహించబోతున్నట్లు ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. మార్చి 18 నుంచి పదో తరగతి, మార్చి 1 నుంచి 15 వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఫిబ్రవరి 5 నుంచి 20 వరకు ఇంటర్ ప్రాక్టికల్స్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు పరీక్షలు జరగనున్నాయి.
ఇంటర్మీడియట్ పరీక్షలు మొదట మార్చి 1 నుంచి ప్రారంభమై మార్చి 20 నాటికి ముగుస్తాయని, 10వ తరగతి పరీక్షలు మార్చి 18 నుంచి ప్రారంభమై మార్చి 30 నాటికి ముగుస్తాయని విద్యాశాఖ మంత్రి బీ సత్యనారాయణ తెలిపారు. పది లక్షల మంది పదో తరగతి, 10 లక్షల మంది ఇంటర్మీడియట్ విద్యార్థులు (మొదటి సంవత్సరం, ద్వితీయ సంవత్సరం) పరీక్షలకు హాజరవుతారని విలేఖరుల సమావేశంలో సత్యనారాయణ తెలిపారు. ఈ పరీక్షలను ప్రతి సంవత్సరం మార్చి నెలలో నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.
పదో తరగతి పరీక్షల షెడ్యూల్ ఇదే
18-03-2024 - ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్-1 (గ్రూప్-ఏ )
18-03-2024 - ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్-1 (కాంపోజిట్ కోర్స్)
19-03-2024 - సెకండ్ ల్యాంగ్వేజ్
20-03-2024 - ఇంగ్లీష్
22-03-2024 - గణితం
23-03-2024 - ఫిజికల్ సైన్స్
26-03-2024 - బయోలాజికల్ సైన్స్
27-03-2024 - సోషల్ స్టడీస్
28-03-2024 - ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్-2 (కాంపోజిట్ కోర్స్)
28-03-2024 - ఓఎస్‌ఎస్‌సీ మెయిన్ లాంగ్వేజ్ పేపర్-1 (సంస్కృతం, అరబిక్, పర్షియన్)
30-03-2024 - ఓఎస్‌ఎస్‌సీ మెయిన్ లాంగ్వేజ్ పేపర్-2 (సంస్కృతం, అరబిక్, పర్షియన్)
30-03-2024 - ఎస్‌ఎస్‌సీ వొకేషనల్ కోర్స్ (థియరీ)
ఇంటర్ పరీక్షల షెడ్యూల్
ఇంటర్ ఫస్టియర్
మార్చి 1న సెకండ్ లాంగ్వేజ్
మార్చి 4న ఇంగ్లీష్
మార్చి 6న గణితం 1-ఏ, బోటనీ -1, సివిక్స్-1
మార్చి9న గణితం 1-బీ, జువాలజీ -1, హిస్టరీ-1
మార్చి 12న ఫిజిక్స్-1,ఎకనామిక్స్-1,
మార్చి 14న కెమిస్ట్రీ-1, కామర్స్ -1, సోషయాలజీ -1, ఫైన్ ఆర్ట్స్,మ్యూజిక్ -1,
మార్చి 16న పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్-1, లాజిక్ పేపర్-1, బ్రిడ్జి కోర్సు లెక్కలు-1
మార్చి 19న మోడర్న్ లాంగ్వేజ్-4,జాగ్రఫీ -1
ఇంటర్ సెకండియర్ షెడ్యూల్
మార్చి 2న సెకండ్ లాంగ్వేజ్ -2
మార్చి5న ఇంగ్లీష్ -2
మార్చి 7న గణితం -2, బోటనీ -2, సివిక్స్ -2
మార్చి 11న గణితం పేపర్ -2బీ, జువాలజీ-2, హిస్టరీ-2
మార్చి 13న ఫిజిక్స్-2, ఎకనామిక్స్ -2
మార్చి 15న కెమిస్ట్రీ -2, కామర్స్ -2, సోషయాలజీ-2, ఫైన్ ఆర్ట్స్ ,మ్యూజిక్ పేపర్ -2
మార్చి 18న పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ -2, లాజిక్ పేపర్ -2, బ్రిడ్జి కోర్సు లెక్కలు -2
మార్చి 20న మోడర్న్ లాంగ్వేజ్-2, జాగఫ్రీ-2