ఆంధ్రప్రదేశ్ క్రికెట్ జట్టుకు విదేశీ కోచ్ వచ్చారు. న్యూజిలాండ్ దిగ్గజం గ్యారీ స్టీడ్, ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) హెడ్ కోచ్‌గా నియమితుడయ్యాడు. స్టీడ్ మార్గదర్శకత్వంలో న్యూజిలాండ్ జట్టు ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ గెలవడమే కాకుండా, పలు ఐసీసీ టోర్నమెంట్లలో రన్నరప్‌గా నిలిచింది. ఈ కీలక నియామకంపై ఏపీ మంత్రి నారా లోకేశ్ హర్షం వ్యక్తం చేశారు. ఇది ఆంధ్రప్రదేశ్‌కు గర్వకారణమని పేర్కొన్నారు. గ్యారీ స్టీడ్ వంటి అద్భుతమమైన కోచ్ రాకతో రాష్ట్రంలోని యువ క్రికెటర్లలో నైపుణ్యం మరింత పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆయన అనుభవం, శిక్షణా పద్ధతులు ఆంధ్ర జట్టును ఉన్నత స్థాయికి తీసుకెళతాయని, ప్రపంచ క్రికెట్ పటంలో మన రాష్ట్రానికి ప్రత్యేక స్థానం లభిస్తుందని లోకేశ్ అభిప్రాయపడ్డారు.