ఊర్లో క్షుద్రపూజల భయం.. గ్రామస్తులంతా జాగారం
ఆ ఊర్లో రాత్రి అయ్యిందంటే చాలు గ్రామస్తులను భయం కమ్మేస్తుంది.
By Srikanth Gundamalla Published on 4 July 2024 1:45 PM ISTఊర్లో క్షుద్రపూజల భయం.. గ్రామస్తులంతా జాగారం
ఆ ఊర్లో రాత్రి అయ్యిందంటే చాలు గ్రామస్తులను భయం కమ్మేస్తుంది. ఎప్పుడు ఎవరు ఎలా చేస్తున్నారో తెలియదు కానీ.. క్షుద్రపూజలు చేస్తున్నారంటూ గ్రామస్తులు చెబుతున్నారు. ఉదయం అయ్యే సరికి గ్రామంలో చెట్లకు, గోడలకు నిమ్మకాయలు,మేకులు కొడుతున్నారు. అంతేకాదు.. రోడ్డుపై అన్నం.. డబ్బులు, కుంకుమ వెదజల్లుతున్నారు. ఈ సంఘటన పల్నాడు జిల్లాలోని చిన్నతురకపాలెం ఊర్లో జరుగింది. అయితే.. ఈ పని ఎవరు చేస్తున్నారో తెలిక గ్రామస్తులు భయంభయంగా ఉంటున్నారు. గ్రామస్తులకు ఏదైనా జరగొచ్చనే ఆందోళన చెందుతున్నారు.
పల్నాడు జిల్లాలోని నర్సరావుపేట మందలం చిన్నతురకపాలెంటో 15 రోజుల క్రితం మొదటి ఓ ఇంటి ముందు గోడకు మేకులు కొట్టి కనిపించాయి. దాన్ని పెద్దగా పట్టించుకోలేదు. ఆ తర్వాత రోజు అదే ఇంటికి నిమ్మకాయలు కట్టారు. ఆ మరుసటి రోజు గ్రామంలో ఉన్న చెట్లకు నిమ్మకాయలు కట్టడం చూశారు. మొదట లైట్ తీసుకున్నా.. రోజూ ఏదో ఒక చోట ఈ సంఘటనలు రిపీట్ అవుతూనే ఉన్నాయి. ప్రతి రోజు ఒకే తంతు జరుగుతుండటంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. రోడ్లపై డబ్బులు.. అన్నం వెదజల్లడం వంటివి జరుగుతున్నాయని చెబుతున్నారు. గ్రామంలో ఎవరో చేతబడి చేస్తున్నారనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రాత్రయ్యిందంటే చాలు గ్రామస్తులు నిద్రపోవడం లేదు. జాగారం చేస్తున్నారు. ఎవరు ఈ పని చేస్తున్నారో తెలుసుకునేందుకు రాత్రి మొత్తం మేల్కొని కాపలా కాస్తున్నారు. తెల్లవారగానే గోడలు..ఇంటి చుట్టూ చె ట్లను తనిఖీ చేసుకుంటున్నారు.
ఇక గ్రామంలో కొన్ని ప్రాంతాల్లో గల్లీలోకే ఎవరూ రాకుండా ముళ్ల కంచెలు ఏర్పాటు చేసుకుంటున్నారు. కర్రలతో అర్ధరాత్రులు కాపలాగా ఉంటున్నారు. అధికారులు తమ గోడుని పట్టించుకోవడం లేదనీ.. ఇకనైనా స్పందించి.. ఈ పని చేస్తుందో ఎవరో కనిపెట్టాలని తమకు రక్షణ కల్పించాలని కోరుతున్నారు.