LIVE UPDATES: ఆంధ్రప్రదేశ్‌ లోక్‌సభ ఎన్నికల ఫలితాలు

లోక్‌సభ ఎన్నికల 2024 ఓట్ల లెక్కింపుతో పాటు ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు మంగళవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతుంది.

By అంజి  Published on  4 Jun 2024 7:09 AM IST
Andhra Pradesh, Lok Sabha Election, Election Results

LIVE UPDATES: ఆంధ్రప్రదేశ్‌ లోక్‌సభ ఎన్నికల ఫలితాలు

అమరావతి: లోక్‌సభ ఎన్నికల 2024 ఓట్ల లెక్కింపుతో పాటు ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు మంగళవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతుంది.

మే 13న ఆంధ్రప్రదేశ్‌లో 175 అసెంబ్లీ స్థానాలు, 25 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరిగాయి.

ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ఆర్‌సీపీ ఒంటరిగా 175 స్థానాల్లో పోటీ చేయడం, టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తు పెట్టుకోవడంతో ఇది మెగా ఎన్నికలుగా మారాయి..

ఏపీ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ఉదయం 8గంటలకు ప్రారంభం కానుంది. మొదట పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తారు. పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు ముగిసిన తర్వాత ఈవిఎంల లెక్కింపు ప్రారంభిస్తారు.

Live Updates

  • 4 Jun 2024 11:00 AM IST

    14 ఎంపీ స్థానాల్లో టీడీపీ ముందంజలో ఉంది...

    టీడీపీ ఆధిక్యంలో ఉన్న స్థానాలు: శ్రీకాకుళం, విజయనగరం, అమలాపురం, వైజాగ్, విజయవాడ, గుంటూరు, నరసరావుపేట, బాపట్ల, నంద్యాల, కర్నూలు, అనంతపురం, హిందూపూర్, నెల్లూరు, చిత్తూరు

    బీజేపీ 3 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది: అనకాపల్లి, రాజమండ్రి, నరసాపురం

    2 స్థానాల్లో జనసేన ఆధిక్యంలో ఉంది: కాకినాడ, మచిలీపట్నం.

  • 4 Jun 2024 10:58 AM IST

    విజయవాడ పార్లమెంట్‌లో టీడీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని చిన్ని వైఎస్సార్‌సీపీ అభ్యర్థి కేశినేని నానిపై ఆధిక్యంలో ఉన్నారు.

  • 4 Jun 2024 10:36 AM IST

    YSRCP MP అభ్యర్థి నాలుగు స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు

    1. చెవిరెడ్డి భాస్కర్ - ఒంగోలు.

    2. అరకు- తనూజా రాణి.

    3. రాజంపేట- మితిన్ రెడ్డి.

    4. కడప- వైఎస్ అవినాష్ రెడ్డి.

  • 4 Jun 2024 9:57 AM IST

    ఈసీ వెబ్‌సైట్ ప్రకారం మొత్తం 25 సెగ్మెంట్లలో టీడీపీ 13, జనసేన 4, వైఎస్సార్‌సీపీ రెండు లోక్‌సభ స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. 

  • 4 Jun 2024 9:47 AM IST

    తొలి రౌండ్‌లో టీడీపీ వైజాగ్ ఎంపీ అభ్యర్థి భరత్ 4300 ఓట్లతో ఆధిక్యంలో ఉన్నారు.

    అనకాపల్లి బీజేపీ అభ్యర్థి సీఎం రమేష్ ఆధిక్యంలో ఉన్నారు.

    రాజంపేట నుంచి బీజేపీ అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డి ఆధిక్యంలో ఉన్నారు. 

  • 4 Jun 2024 9:40 AM IST

    తొలి రౌండ్‌లో టీడీపీ వైజాగ్ ఎంపీ అభ్యర్థి భరత్ 4300 ఓట్లతో ఆధిక్యంలో ఉన్నారు.

    అనకాపల్లి బీజేపీ అభ్యర్థి సీఎం రమేష్ ఆధిక్యంలో ఉన్నారు.

    రాజంపేట నుంచి బీజేపీ అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డి ఆధిక్యంలో ఉన్నారు.

    నెల్లూరు టీడీపీ ఎంపీ వేమిరెడ్డి ఆధిక్యంలో ఉన్నారు.

    విజయవాడ టీడీపీ ఎంపీ చిన్ని ముందంజలో ఉన్నారు.

    బీజేపీ-టీడీపీ-జనసేన కూటమి 11 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, వైఎస్సార్‌సీపీ 3 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. 

  • 4 Jun 2024 9:07 AM IST

    శ్రీకాకుళం టీడీపీ ఎంపీ అభ్యర్థి కింజరాపు రామ్మోహన్ నాయుడు 1861 ఓట్ల మెజార్టీతో ఆధిక్యంలో ఉన్నారు.

    టీడీపీ నంద్యాల ఎంపీ అభ్యర్థి శబరి ఆధిక్యంలో ఉన్నారు.

    కడప లోక్‌సభలో వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థి వైఎస్‌ అవినాష్‌రెడ్డి 2,274 ఓట్లతో ఆధిక్యంలో ఉన్నారు.

  • 4 Jun 2024 8:59 AM IST

    నెల్లూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి పోస్టల్‌ బ్యాలెట్‌లో ఆధిక్యంలో నిలిచారు. వైసీపీ ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి వెనుకంజలో ఉన్నారు.

  • 4 Jun 2024 8:51 AM IST

    నరసరావుపేటలో టీడీపీ ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు ఆధిక్యంలో ఉన్నారు. 

  • 4 Jun 2024 8:43 AM IST

    బీజేపీ రాజమండ్రి ఎంపీ అభ్యర్థి పురందేశ్వరి ఆధిక్యంలో ఉన్నారు. 

Next Story