LIVE UPDATES: ఆంధ్రప్రదేశ్‌ లోక్‌సభ ఎన్నికల ఫలితాలు

లోక్‌సభ ఎన్నికల 2024 ఓట్ల లెక్కింపుతో పాటు ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు మంగళవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతుంది.

By అంజి  Published on  4 Jun 2024 1:39 AM GMT
Andhra Pradesh, Lok Sabha Election, Election Results

LIVE UPDATES: ఆంధ్రప్రదేశ్‌ లోక్‌సభ ఎన్నికల ఫలితాలు

అమరావతి: లోక్‌సభ ఎన్నికల 2024 ఓట్ల లెక్కింపుతో పాటు ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు మంగళవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతుంది.

మే 13న ఆంధ్రప్రదేశ్‌లో 175 అసెంబ్లీ స్థానాలు, 25 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరిగాయి.

ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ఆర్‌సీపీ ఒంటరిగా 175 స్థానాల్లో పోటీ చేయడం, టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తు పెట్టుకోవడంతో ఇది మెగా ఎన్నికలుగా మారాయి..

ఏపీ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ఉదయం 8గంటలకు ప్రారంభం కానుంది. మొదట పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తారు. పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు ముగిసిన తర్వాత ఈవిఎంల లెక్కింపు ప్రారంభిస్తారు.

Live Updates

  • 4 Jun 2024 3:02 AM GMT

    ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ (ఏపీసీసీ) అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల, ఆంధ్రప్రదేశ్‌ బీజేపీ చీఫ్‌ డి.పురంధేశ్వరి ఎన్నికల అదృష్టం నేడు ఖరారు కానుంది. షర్మిల కడప లోక్‌సభ నియోజకవర్గం నుంచి, పురంధేశ్వరి రాజమహేంద్రవరం నుంచి పోటీ చేశారు. 

  • 4 Jun 2024 2:52 AM GMT

    రాష్ట్రవ్యాప్తంగా 33 చోట్ల 401 హాళ్లలో కౌంటింగ్ ప్రారంభమైంది, ఇందులో పార్లమెంటరీ నియోజకవర్గాలకు 2,443, అసెంబ్లీ నియోజకవర్గాలకు 2,446 ఈవీఎం టేబుల్స్ ఉంటాయి. అలాగే పార్లమెంట్‌ నియోజకవర్గాలకు పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్ల లెక్కింపునకు 443, అసెంబ్లీ స్థానాలకు 557 టేబుళ్లను ఏర్పాటు చేశారు.

  • 4 Jun 2024 2:51 AM GMT

    లోక్‌సభ నియోజకవర్గాలకు పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. 

Next Story