రాష్ట్ర హైకోర్టును అమరావతి నుంచి కర్నూలుకు తరలించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కేంద్రానికి ప్రతిపాదన వచ్చిందని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు శుక్రవారం తెలిపారు. లోక్‌సభలో హైకోర్టును కర్నూలుకు తరలించే అంశంపై వైసీపీ ఎంపీలు కోటగిరి శ్రీధర్, చింతా అనురాధ కేంద్రాన్ని అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇచ్చారు.
హైకోర్టును కర్నూలుకు మార్చడంపై రాష్ట్ర ప్రభుత్వమే హైకోర్టును సంప్రదించి నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేశారు. హైకోర్టు పరిపాలనా ఖర్చులన్నీ రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని, ఒక ప్రక్రియ ప్రకారం హైకోర్టును కర్నూలుకు మార్చడంపై రాష్ట్ర ప్రభుత్వం, హైకోర్టు ఒక నిర్ణయానికి రావాలి. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదన పంపాలని తెలిపారు.