సంగం డెయిరీని ఆంధ్రప్రదేశ్ పాడిపరిశ్రమాభివృద్ధి సంస్థ పరిధిలోకి తీసుకొస్తూ ఇటీవల ప్రభుత్వం జీవో ను జారీచేసింది. ఈ జీవోను సవాల్ చేస్తూ.. ఆ సంస్థ డెరెక్టర్లు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై శుక్రవారం కోర్టు విచారణ చేపట్టింది. నిబంధనలకు విరుద్దంగా ప్రభుత్వం తమ ఆధీనంలోని తీసుకుందని పిటిషనర్ల తరుపు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. దీనిపై ప్రభుత్వం తరుపు న్యాయవాదులు.. ప్రజాప్రమోజనం దృష్ట్యా తాత్కాలికంగానే ఈ జీవో ఇచ్చామని, సంగం డెయిరీ రోజువారి విధులు నిర్వహించేందుకు మాత్రమే అధికారులను ఏర్పాటు చేశామని.. ఈ క్రమంలోనే జీవో ఇవ్వాల్సి వచ్చిందని ఉన్నత న్యాయస్థానానికి తెలిపారు.
ఇరువైపు వాదనలు విన్న హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. డెయిరీని ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకుంటూ ఇచ్చిన జీవోను నిలుపుదల చేసింది. ఆస్తులు అమ్మాలన్నా, కొనాలన్నా కోర్టు అనుమతి తప్పనిసరి అని తెలిపింది. డైరెక్టర్స్ తమ రోజువారీ విధులు నిర్వహించుకోవచ్చని కోర్టు సూచించింది.