ఆశావర్కర్లతో సర్కార్‌ చర్చలు.. సమస్యలు పరిష్కారం అయ్యేనా.!

Andhra pradesh govt with discussions with asha workers. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ గత కొన్ని రోజులుగా ఆశా వర్కర్లు ఆందోళన బాటపట్టారు.

By అంజి  Published on  24 Feb 2022 5:44 PM IST
ఆశావర్కర్లతో సర్కార్‌ చర్చలు.. సమస్యలు పరిష్కారం అయ్యేనా.!

ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ గత కొన్ని రోజులుగా ఆశా వర్కర్లు ఆందోళన బాటపట్టారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించేందుకు చర్చలు మొదలుపెట్టింది. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, ఆ శాఖ కమిషనర్‌ కె.భాస్కర్‌, ముఖ్య కార్యదర్శి ఎం.రవిచంద్రలతో ఆశా వర్కర్ల సంఘం ప్రతినిధులు భేటీ అయ్యారు. ఎన్‌సిడిసి సర్వేను ప్రభుత్వం ఆశా వర్కర్లతో చేయిస్తోంది. దీని వల్ల పని భారం పెరుగుతోందని, తక్షణమే నిలిపివేయాలని ఆశా వర్కర్ల సంఘం కోరింది.

కొత్త పీఆర్‌సీ విధానాన్ని అనుసరించి ఆశావర్కర్ల గౌరవ వేతం రూ.10 వేల నుండి రూ.15 వేలకు వరకు పెంచాలని, అలవెన్సులు, ఉద్యోగ విరమణ అనంతర ప్రయోజనాలతో పాటు, పలు అంశాలపై మరోసారి రాష్ట్ర సర్కార్‌తో చర్చించనున్నారు. త్వరలోనే వీటిపై చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వం తెలిపింది. రంపచోడవరంలో అధిక డోస్‌ ఇంజెక్షన్‌ కారణంగా గర్భిణీ ఆశా వర్కర్‌ మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో బాధ్యులపై తగిన చర్యలు తీసుకుంటామని సర్కార్ హామీ ఇచ్చింది. త్వరలోనే ఆశా వర్కర్లకు కొత్త ఫోన్‌ల పంపిణీపై నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసింది. ఆశా వర్కర్లకు స్మార్ట్‌ఫోన్లు ఇచ్చేందుకు.. 56 వేల స్మార్ట్‌ ఫోన్‌లు కొనుగోలు చేస్తున్నామని ఇప్పటికే మంత్రి తానేటి వనిత తెలిపారు.

Next Story