యుద్ధ బాధిత ఇరాన్ విద్యార్థినులకు ఏపీ ప్రభుత్వం అండ..రూ.లక్ష ఆర్థిక సాయం అందజేత

పశ్చిమాసియా యుద్ధ పరిణామాల నేపథ్యంలో విశాఖపట్నంలో విద్యనభ్యసిస్తున్న ఇద్దరు ఇరానీ విద్యార్థినులకు ఏపీ ప్రభుత్వం అండగా నిలిచింది.

By -  Knakam Karthik
Published on : 10 April 2026 4:20 PM IST

AndhraPradesh, Visakhapatnam, IranStudents, FinancialAid, WestAsiaConflict, EducationSupport, AndhraUniversity

యుద్ధ బాధిత ఇరాన్ విద్యార్థినులకు ఏపీ ప్రభుత్వం అండ..రూ.లక్ష ఆర్థిక సాయం అందజేత

పశ్చిమాసియా యుద్ధ పరిణామాల నేపథ్యంలో విశాఖపట్నంలో విద్యనభ్యసిస్తున్న ఇద్దరు ఇరానీ విద్యార్థినులకు ఏపీ ప్రభుత్వం అండగా నిలిచింది. యుద్ధం కారణంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సోదరీమణులు జీనాబ్, సోల్మాజ్‌లకు రూ. 1 లక్ష ఆర్థిక సాయాన్ని విశాఖ జిల్లా కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిషోర్ అందజేశారు.

వీరిద్దరూ ఆంధ్ర యూనివర్సిటీలో ఫార్మసీ చదువుతున్నారు. తమకు సాయం చేయాలని వారు బుధవారం అధికారులను కోరగా, సానుకూలంగా స్పందించిన కలెక్టర్.. జిల్లా సంజీవని నిధి నుండి రూ. 50 వేలు, కనకమహాలక్ష్మి దేవస్థానం నుండి రూ. 50 వేలు కలిపి మొత్తం లక్ష రూపాయలను గురువారం అందజేశారు. విదేశీ విద్యార్థుల పట్ల ప్రభుత్వం చూపిన ఈ మానవతా దృక్పథంపై ప్రశంసలు వ్యుక్తమవుతున్నాయి.

Next Story