ప్రభుత్వం కీలక నిర్ణయం.. రొమేనియా, హంగేరీ దేశాలకు ఏపీ ప్ర‌తినిధులు

Andhra Pradesh govt decides send representatives poland and hungary.ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భార‌తీయుల‌ను సుర‌క్షితంగా

By తోట‌ వంశీ కుమార్‌  Published on  2 March 2022 4:25 PM IST
ప్రభుత్వం కీలక నిర్ణయం.. రొమేనియా, హంగేరీ దేశాలకు ఏపీ ప్ర‌తినిధులు

ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భార‌తీయుల‌ను సుర‌క్షితంగా స్వ‌దేశానికి తీసుకువ‌చ్చేందుకు కేంద్రం ప్ర‌భుత్వం ఆప‌రేష‌న్ గంగ చేప‌ట్టిన సంగ‌తి తెలిసిందే. ఓ వైపు కేంద్ర ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకుంటుండ‌గా.. మ‌రో వైపు ఆంధ్ర‌ప్ర‌దేశ్ కూడా త‌న వంతు ప్ర‌య‌త్నాలు చేస్తోంది. ఈ క్ర‌మంలో బుధ‌వారం ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఉక్రెయిన్‌తో స‌రిహ‌ద్దు పంచుకుంటున్న పొలెండ్‌, హంగేరీ దేశాల‌కు ఏపీ ప్ర‌తినిధుల‌ను పంపాల‌ని సీఎం జ‌గ‌న్ అధికారుల‌ను ఆదేశించారు. విద్యార్థుల‌ను క్షేమంగా తీసుకువ‌చ్చేందుకు అన్ని చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సూచించారు. కాగా.. ఇప్పటికే ఏపీకి చెందిన 680 మంది విద్యార్థుల వివరాలను రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర విదేశాంగ శాఖకు అందించింది.

నాబార్డ్ వార్షిక రుణ ప్రణాళికపై సమీక్ష..

అంత‌క‌ముందు తాడేప‌ల్లిలోని క్యాంప్ కార్యాల‌యంలో సీఎం జ‌గ‌న్ నాబార్డ్ వార్షిక రుణ ప్రణాళిక‌పై స‌మీక్ష నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా జ‌గ‌న్ మాట్లాడుతూ..క‌రోనా లాంటి ప‌రిస్థితులు ఉన్న‌ప్ప‌టికీ కూడా వ్య‌వ‌సాయ రంగం మ‌ద్ద‌తుగా నిలిచింద‌ని సీఎం జ‌గ‌న్ అన్నారు. రాష్ట్రంలో చేస్తున్న ప‌లు కార్య‌క్ర‌మాల‌కు నాబార్డ్, బ్యాంకులు స‌హాయ‌ప‌డుతున్నాయ‌ని చెప్పారు. రైతు భరోసా, సున్నావడ్డీ రుణాలు, రైతులకు ఉచిత పంటల బీమా ఇవన్నీ అమలు చేస్తున్న‌ట్లు తెలిపారు.

ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు,పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నాబార్డ్ చైర్మన్ జీఆర్ చింతల త‌దిత‌రులు ఈ స‌మీక్ష‌లో పాల్గొన్నారు.

Next Story