ఆసుపత్రి పాలైన ఏపీ గవర్నర్.. ఇప్పుడు ఎలా ఉన్నారంటే?

ఆంధ్రప్రదేశ్ గవర్నర్ సయ్యద్ అబ్దుల్ నజీర్ శనివారం అకస్మాత్తుగా అస్వస్థతకు గురికావడంతో భద్రతా సిబ్బంది ఆయన్ను ఆసుపత్రికి తరలించారు.

By అంజి
Published on : 24 March 2024 9:34 AM IST

Andhra Pradesh, Governor, Abdul Nazeer

ఆసుపత్రి పాలైన ఏపీ గవర్నర్.. ఇప్పుడు ఎలా ఉన్నారంటే? 

ఆంధ్రప్రదేశ్ గవర్నర్ సయ్యద్ అబ్దుల్ నజీర్ శనివారం అకస్మాత్తుగా అస్వస్థతకు గురికావడంతో భద్రతా సిబ్బంది ఆయన్ను ఆసుపత్రికి తరలించారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. గవర్నర్ నజీర్ అకస్మాత్తుగా అస్వస్థతకు గురయ్యారు, వెంటనే భద్రతా సిబ్బంది ఆయన్ను విజయవాడ మణిపాల్ ఆసుపత్రికి తరలించారు. ఆయన అస్వస్థతకు గురికావడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. అయితే ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని గవర్నర్ కార్యాలయం తెలిపింది.

గవర్నర్‌ అబ్దుల్‌ నాజిర్‌కు వైద్య పరీక్షలు చేసి ఎండోస్కోపీ నిర్వహించాలని వైద్యులు సూచించినట్లు తెలుస్తోంది. గవర్నర్‌ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉందని.. ఆందోళన చెందవద్దని అధికారులు తెలిపారు. అకస్మాత్తుగా గవర్నర్‌ అనారోగ్యానికి గురి కావడానికి గల కారణాలు మాత్రం తెలియరాలేదు.

Next Story