ఏపీలో పెన్షన్ల పంపిణీపై స్పష్టత

ఆంధ్రప్రదేశ్‌లో పెన్షన్ల పంపిణీపై స్పష్టత వచ్చింది.

By Srikanth Gundamalla  Published on  29 April 2024 1:01 AM GMT
andhra pradesh, government, pension, money,

ఏపీలో పెన్షన్ల పంపిణీపై స్పష్టత 

ఆంధ్రప్రదేశ్‌లో పెన్షన్ల పంపిణీపై స్పష్టత వచ్చింది. మే నెలకు సంబంధించిన పెన్షన్ల డ్బుబను మే 1వ తేదీనే లబ్దిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మొత్తం 14,995 గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న సిబ్బంది సేవలను ప్రభుత్వం వినియోగించుకోనుంది. 10,814 కేంద్రాలను ప్రభుత్వ కార్యాలయాల్లో ఏర్పాటు చేసి అక్కడి నుంచి పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం పర్యవేక్షించనుంది. ఒక వేళ ఏదైనా సస్యతో బ్యాంకు అకౌంట్‌లో మే 1వ తేదీన నగదు జమ కాకపోతే.. అలాంటి వారికి మే 2వ తేదీన ఇంటి దగ్గరే నగదును అందించనున్నారు.

ఇక ఇళ్ల దగ్గర పెన్షన్ తీసుకునే లబ్ధిదారుల జాబితా గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల పెన్షన్ యాప్‌లో ఉంటుంది. బ్యాంకు అకౌంట్ల ద్వారా స్వీకరించే వారి జాబితాను గ్రామ ,వార్డు సచివాలయ వద్ద అందుబాటులో ఉంచున్నారు. మే 5వ తేదీ నాటికి పెన్షన్ పంపిణీ ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు గతంలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను సవరించింది.

కాగా.. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా 65.50 లక్షల మంది పెన్షన్ దారులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. వీరిలో 48.92 లక్షల మంది అంటే 74 శాతం మంది బ్యాంకు ఖాతాలు ఆధార్‌తో అనుసంధానం అయినట్లు గుర్తించారు అధికారు. వీరందరికీ పెన్షన్‌ మొత్తాన్ని మే 1వ తేదీన నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు. మిగతా 16.58 లక్షల మందికి ఇంటికి వెళ్లి పెన్షన్లు అందించనున్నట్లు ప్రభుత్వ ఉన్నతాధికారులు చెప్పారు. ఎన్నికల వేళ పెన్షన్ల పంపినీ ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని ఎన్నికల సంఘం సూచించిన సందర్భంగా ఈ ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు.

మే 1వ తేదీన కార్మిక దినోత్సవం.. ఆ రోజు బ్యాంకులకు సెలవు అయినప్పటికీ సంబంధిత కార్పొరేషన్ల నుంచి లబ్ధిదారుల ఖాతాలకు నగదు జమ కానున్నట్లు అధికారులు చెప్పారు. నగదు జమ చేయడంలో బ్యాంకుల ప్రమేయం ఏమాత్రం లేదన్నారు. ఇంటి దగ్గరే పింఛన్‌ అందించడానికి సచివాలయాల్లో సిబ్బంది, పరికరాలను అందుబాటులో ఉంచేలా జిల్లా కలెక్టర్లు సమన్వయం చేయాలని ఆదేశించారు. పింఛన్‌దారులకు అసౌకర్యం తలెత్తకూడదన్నారు.

Next Story