రాష్ట్రంలో అన్నదాతలకు శుభవార్త, రేపే ఖాతాల్లోకి డబ్బులు జమ
ష్ట్రంలోని రైతులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది.
By Knakam Karthik
రాష్ట్రంలో అన్నదాతలకు శుభవార్త, రేపే ఖాతాల్లోకి డబ్బులు జమ
అమరావతి: రాష్ట్రంలోని రైతులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. సూపర్ సిక్స్ హామీల అమలులో భాగంగా ‘అన్నదాత సుఖీభవ’ పథకాన్ని రేపు అమలు చేయాలని నిర్ణయించింది. ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో ఈ పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించనున్నారు. దీంతో రాష్ట్రంలోని 46,85,838 మంది రైతులు లబ్ది పోందనున్నారు. మొదటి విడతలో రాష్ట్ర వాటాగా ఒక్కో రైతుకు రూ.5,000 చొప్పున మొత్తం రూ.2,342.92 కోట్ల నిధుల్ని వారి ఖాతాలో ప్రభుత్వం నేరుగా జమ చేయనుంది.
రైతన్నలకు మేలు చేసే కీలక పథకమైన అన్నదాత సుఖీభవ అమలు సన్నద్ధతపై సచివాలయంలో ఆర్థిక, రెవెన్యూ, జలవనరులు, వ్యవసాయ శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షలో పాల్గొన్న జిల్లా కలెక్టర్లకు ముఖ్యమంత్రి పలు ఆదేశాలు జారీ చేశారు. అర్హులైన ప్రతీ రైతుకూ అన్నదాత సుఖీభవ అందాలని, రైతులకు చేయూతనివ్వడం భారం కాదు.. బాధ్యతగా గుర్తు పెట్టుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. రైతులకు నిధులే కాదు.. నీళ్లూ ఇస్తున్నామని చెప్పారు. రేపు అన్నదాత సుఖీభవ పథకం అమలు కార్యక్రమం పండుగ వాతావరణంలో జరగాలని. గ్రామ సచివాలయం నుంచి పంచాయతీలు, మండల కేంద్రాలు, నియోజకవర్గ కేంద్రాల స్థాయిలో ఈ కార్యక్రమం నిర్వహించాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు.