ఏపీలో రేషన్ కార్డులు ఉన్నవారికి గుడ్‌న్యూస్
ఆంధ్రప్రదేశ్‌లో రేషన్‌కార్డులు ఉన్నవారికి ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది.
By Srikanth Gundamalla Published on 9 July 2024 6:52 AM IST
ఏపీలో రేషన్ కార్డులు ఉన్నవారికి గుడ్‌న్యూస్
ఆంధ్రప్రదేశ్‌లో రేషన్‌కార్డులు ఉన్నవారికి ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. అన్ని రైతు బజార్లలో తక్కువ ధరలకే సరుకులను అందజేయనున్నట్లు తెలిపింది. ఈ మేరకు వివరాలను పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. విజయవాడలో నిత్యావసరాల పెరుగుదలపై సమావేశం నిర్వహించిన ఆయన.. రాష్ట్రవ్యాప్తంగా రైతుబజార్ల ద్వారా తక్కువ ధరకే కందిపప్పు, బియ్యం పంపిణీ చేయడంపై చర్చించారు. ఈ నెల 11 నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని రైతు బజార్లలోనూ నిర్ణయించిన రేట్ల ప్రకారమే సరకులు విక్రయించేందుకు వర్తకులు అంగీకరించారు.
రైతు బజార్లలో విక్రయించే సరుకుల వివరాలు: కందిపప్పు బహిరంగ మార్కెట్‌లో ధర కేజీ రూ.181 కాగా.. రైతు బజార్లలో రూ.160కే విక్రయిస్తారు. స్టీమ్డ్ బియ్యం బహిరంగ మార్కెట్‌లో ధర కేజీ రూ.55.85 కాగా..రైతు బజార్లలో రూ.49కే విక్రయిస్తారు. బియ్యం బహిరంగ మార్కెట్‌లో ధర కేజీ రూ.52.40 కాగా..రైతు బజార్లలో రూ.48కే విక్రయిస్తారు.
గత ప్రభుత్వ హాయంలో పేదలకు ఎలాంటి మంచి జరగలేదని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. అవినీతి, అక్రమాల నియంత్రణపై తాము దృష్టి పెట్టినట్లు చెప్పారు. గత సర్కార్ రేషన్ సర్కుల్లో వేల కోట్ల అవినీతి పాల్పడిందని చెప్పారు. ఆకస్మిక తనిఖీలతో ప్రజలకు ఇచ్చే పంచదా కందిపప్పు, నూనె వంటి ప్యాకెట్ల తూకంలో తేడాలు గుర్తించామన్నారు. అందుకే వాటి పంపిణీ నిలిపివేసినట్లు చెప్పారు. ప్రజలకు నిత్యావసరాలు అందుబాటులో ఉండే విధంగా అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదేశించారు.
'రాష్ట్రంలో నిత్యావసర ధరల నియంత్రణకు ప్రభుత్వం రంగంలోకి దిగిందని టీడీపీ ఎక్స్‌లో పేర్కొంది. ఈ మేరకు జీవో కాపీని కూడా షేర్ చేసింది. ఇష్టానుసారంగా ధరలు పెంచకుండా కందిపప్పు, బియ్యం ధరల స్థిరీకరణకు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చినట్లు పేర్కొంది. కందిపప్పు బహిరంగ మార్కెట్‌లో కిలో రూ.181కి, రైతు బజార్లలో రూ.160కి అమ్మటానికి అనుమతి ఇచ్చిందని టీడీపీ వివరించింది.. అలాగే బియ్యం ధరలు బహిరంగ మార్కెట్‌లో కిలో రూ.55.85కి, రైతు బజార్లలో రూ.48కి అమ్మటానికి అనుమతి ఇచ్చిందని ఎక్స్‌లో టీడీపీ పేర్కొంది.
రాష్ట్రంలో నిత్యావసర ధరల నియంత్రణకు ప్రభుత్వం రంగంలోకి దిగింది. ఇష్టానుసారంగా ధరలు పెంచకుండా కందిపప్పు, బియ్యం ధరల స్థిరీకరణకు ఆదేశాలు ఇచ్చింది. కందిపప్పు బహిరంగ మార్కెట్‌లో కిలో రూ.181కి, రైతు బజార్లలో రూ.160కి అమ్మటానికి అనుమతి ఇచ్చింది. అలాగే బియ్యం ధరలు బహిరంగ మార్కెట్‌లో… pic.twitter.com/uwCaRDrByQ
— Telugu Desam Party (@JaiTDP) July 8, 2024