అమరావతి: రాష్ట్రంలో సీపీఎస్ ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. మొదటి విడత డీఏ బకాయిలు విడుదల చేసింది. దీంతో డీఏ బకాయిల విడుదల పట్ల ఏపీ సచివాలయ సీపీఎస్ ఉద్యోగల సంఘం హర్షం వ్యక్తం చేసింది. సీపీఎస్ ఉద్యోగుల డీఏ, ఏరియర్స్ ఏపీ సచివాలయ సీపీఎస్ ఉద్యోగులకు జమ చేసినట్లు తెలిపింది. త్వరలోనే మిగిలిన సీపీఎస్ ఉద్యోగులందరికీ 90 శాతం బకాయిలు నగదుగా చెల్లించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. సుమారు ఆరు విడతలలో ఈ మొత్తం చెల్లింపులు చేసేందుకు నిర్ణయం తీసుకుంది. కాగా ప్రస్తుతం ఒక్కో ఉద్యోగికి రూ.40 వేల నుంచి రూ.70 వేల వరకు అకౌంట్లలో ప్రభుత్వం జమ చేసింది. మిగతా వారికి ఆరు విడతల్లో ఒక్కో ఉద్యోగికి 2 నుంచి 4 లక్షల రూపాయల వరకు బకాయిలు చెల్లించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.