ఏపీలో పెన్షన్‌దారులకు గుడ్‌న్యూస్.. జూలై 1న రూ.7వేలు పంపిణీ
ఏపీలో కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుపై ఫోకస్ పెట్టింది.
By Srikanth Gundamalla Published on 24 Jun 2024 12:51 AM GMTఏపీలో పెన్షన్‌దారులకు గుడ్‌న్యూస్.. జూలై 1న రూ.7వేలు పంపిణీ
ఏపీలో కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుపై ఫోకస్ పెట్టింది. తాము అధికారంలోకి రాగానే పెన్షన్‌లను పెంచి అమలు చేస్తామని కూటమి పార్టీలు చెప్పాయి. జూలై 1వ తేదీ నుంచి ఇంటింటికీ పెన్షన్ పంపిణీ దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు రూ.4వేలకు పెన్షన్ పెంచనుంది రాష్ట్ర ప్రభుత్వం. వెయ్యి రూపాయలు పెంచుతూ.. గత నెలల పెంపునకు సంబంధించిన రూ.3వేలు మొత్తం కలిపి రూ.7వేలను పెన్షన్ దారులకు అందించనున్నట్లు టీడీపీ తన ఎక్స్ అధికార హ్యాండిల్‌లో పేర్కొంది. అయితే.. చంద్రబాబు సీఎంగా బాధ్యతలు తీసుకున్న తర్వాత పెన్షన్ పెంపుపై సంతకం చేసిన విషయం తెలిసిందే.
ఇక దివ్యాంగులకు రూ.6వేలు, పూర్తి స్థాయి దివ్యాంగులకు రూ.15వేలకు పెంచనున్నట్లు తెలిపింది. అనారోగ్యంతో బాధపడే వారికి రూ.10వేలకు పెంచుతూ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. పెన్షన్ల పంపిణీని వాలంటీర్ల ద్వారా చేయాలా లేక ప్రభుత్వ సిబ్బంది చేత చేయించాలా అనేదానిపై ఇంకా క్లారిటీ రాలేదు. కాగా.. గత మూడు నెలలు ఎన్నికల కోడ్ కారణంగా పెన్షన్ డబ్బులను లబ్ధిదారుల అకౌంట్లలో జమ చేసిన విషయం తెలిసిందే. అప్పుడు టీడీపీ నాయకులు ఇంటి వద్దకే వెళ్లి పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. మరి ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.
పింఛన్ల లబ్ధిదారులకు చంద్రబాబు గారు ఇచ్చిన మాట నెరవేర్చబోతున్నారు. వెయ్యి పెంచగా అయిన రూ.4000, గత మూడు నెలల పెంపు రూ.3000 కలిపి రూ.7000 పింఛన్ ఎన్టీఆర్ భరోసా పేరుతో జూలై 1న ఇంటి వద్దే అందించనున్నారు.#NaraChandrababuNaidu #AndhraPradesh pic.twitter.com/0wZFUunCWR
— Telugu Desam Party (@JaiTDP) June 23, 2024
మరోవైపు ఇవాళ ఏపీ కేబినెట్ సమావేశం కానుంది. ఇవాళ పెన్షన్ ను ఎలా పంపిణీ చేయాలనే దానిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఆర్థిక మంత్రి పయ్యావుల పెన్షన్ పంపిణీపై ఇప్పటికే మాట్లాడారు. తమకు పెన్షన్‌ను ఇంటింటికీ వెళ్లి ఇచ్చేందుకు ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పారు. జూలై 1 నుంచే సీఎం చంద్రబాబుచేత పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించాలని కూటమి నేతలు ఆలోచిస్తున్నారని తెలుస్తోంది. కేబినెట్ సమావేశంలో దీనిపై క్లారిటీ రానుంది.