ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నమిలే పొగాకు, తంబాకు, గుట్కా, పాన్ మసాలాపై ఏడాది పాటు నిషేదం విధించింది. నేటి(డిసెంబర్ 7) నుంచి ఈ నిషేదం అమల్లోకి రానుంది. ఈ మేరకు కుటుంబ సంక్షేమ, ఆహార భద్రత శాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్ ఉత్తర్వులు జారీ చేశారు. నికోటిన్ కలిపిన ఆహార ఉత్పత్తులయిన గుట్కా, పాన్ మసాలా, నమిలే పొగాకు పదార్థాలు అన్నింటిపై ప్రభుత్వం డిసెంబర్ 7, 2021 నుంచి 2022 డిసెంబర్ 7 వరకు బ్యాన్ విధించింది. వీటిని ఎవరైనా ఏ పేరుతోనైనా తయారు చేయడం, అమ్మడం, సరఫరా చేయడం, నిల్వ ఉంచడాన్ని నేరంగా పరిగణిస్తామని పేర్కొంది. నిబంధనలు అత్రికమించిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. ప్రత్యేకంగా ఇందుకోసం నిఘా పెట్టనున్నట్లు వెల్లడించింది.
మరో తెలుగు రాష్ట్రం తెలంగాణలోనూ గుట్కా, పాన్ మాసాలాలపై ప్రభుత్వం నిషేదం విదించిన సంగతి తెలిసిందే. కాగా.. దీన్ని సవాల్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర హైకోర్టులో 160 పిటిషన్లు దాఖలు అయ్యాయి. వీటన్నింటిని హైకోర్టు కోర్టు వేసింది. కరోనా మమమ్మారి కంటే గుట్కా వల్లే ఎక్కువ మంది ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని ఈ సందర్భంగా హైకోర్టు వ్యాఖ్యానించింది.