పవన్‌కు హైకోర్టులో షాక్..రేపటి విచారణపై సర్వత్రా ఉత్కంఠ
ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కు హైకోర్టులో షాక్ తగిలింది.
By Knakam Karthik
పవన్‌కు హైకోర్టులో షాక్..రేపటి విచారణపై సర్వత్రా ఉత్కంఠ
ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కు హైకోర్టులో షాక్ తగిలింది. ఆయనపై విచారణకు రాష్ట్ర ఉన్నత న్యాయ స్థానం ముందుకు రావడం హాట్ టాఫిక్‌గా మారింది. సినిమా ప్రమోషన్‌లో ప్రభుత్వ నిధులు, అధికార యంత్రాంగాన్ని వినియోగించారని, మంత్రి గా కొనసాగుతూ సినిమాలు చేస్తున్నారని, ఆయనపై స్వతంత్ర దర్యాప్తునకు ఆదేశించాలంటూ మాజీ ఐఏఎస్ అధికారి విజయ్‌కుమార్ హైకోర్టులో గత 19న పిటిషన్ దాఖలు చేశారు. ప్రభుత్వ భద్రతా సిబ్బంది, అధికారిక వాహనాలు, ఇతర వనరులను సినిమా కార్యక్రమాలకు వినియోగించడం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడమే అవుతుందని పిటిషన్‌లో పేర్కొన్నారు.
ఉపముఖ్యమంత్రి సినిమాల్లో నటన కొనసాగించడాన్ని అనైతికం, రాజ్యాంగవిరుద్ధమై చర్యగా ప్రకటించాలని కోరారు. ఈ వ్యాజ్యంపై గత నెలలో హైకోర్టు ముందు విచారణకు వచ్చింది. విచారణ సందర్భంగా రాష్ట్ర హోంశాఖ తరఫు ప్రభుత్వ న్యాయవాది జయంతి స్పందిస్తూ...ఉపముఖ్యమంత్రిని వ్యక్తిగత హోదాలో ప్రతివాదిగా చేర్చడంపై అభ్యంతరం తెలిపారు. వ్యాజ్యం మొదటిసారి విచారణకు వచ్చిందని, అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపిస్తారన్నారు. వ్యాజ్యాన్ని పరిశీలించిన న్యాయమూర్తి జస్టిస్ జోతిర్మయి ప్రతాప సీబీఐ, ఏసీబీ తరపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ల పేర్లను కేసుల విచారణ జాబితాలో (కాజ్‌లిస్ట్) పేర్కొనకపోవడాన్ని తప్పుపట్టారు. వారి పేర్లను చేర్చాలని రిజిస్ట్రీని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేశారు. మరోసారి హైకోర్టులో వాదనలు జరుగగా..ఈ కేసును ఈ నెల 8వ తేదీ విచారిస్తామని హైకోర్టు ప్రకటించడం పట్ల సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. నేరం రుజువైతే పవన్‌పై చర్యలు తప్పవా అన్న చర్చ జరుగుతోంది. సోమవారం విచారణలో ఏం జరుగుతుందోనన్న సందిగ్ధత నెలకొంది.