ఆ అధికారి పదవీకాలం పొడగించండి..కేంద్రానికి సీఎం చంద్రబాబు లేఖ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నీరభ్ కుమార్ ప్రసాద్ ప్రస్తుతం పదవిలో ఉన్నారు.
By Srikanth Gundamalla Published on 20 Jun 2024 6:00 AM GMTఆ అధికారి పదవీకాలం పొడగించండి..కేంద్రానికి సీఎం చంద్రబాబు లేఖ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నీరభ్ కుమార్ ప్రసాద్ ప్రస్తుతం పదవిలో ఉన్నారు. అయితే.. ఆయన త్వరలోనే రిటైర్ కాబోతున్నారు. నీరభ్ కుమార్ ప్రసాద్ పదవీకాలం పొడగించాలని ఏపీ సీఎం చంద్రబాబు కేంద్రానికి లేఖ రాశారు. ఆరు నెలల పాటు నీరభ్ పదవీకాలాన్ని పొడిగించాలని కోరుతూ బుధవారం సీఎం చంద్రబాబు లేఖను పంపించారు.
జూన్ మొదటి వారంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నీరభ్ కుమార్ ప్రసాద్ బాధ్యతలను తీసుకున్నారు. ఆమయ పదవీకాలం నెలాఖరులోనే ముగియనుంది. రిటైర్ కాబోతున్నారు. ఏపీ ప్రభుత్వం మాత్రం ఆయన సేవలను కొనసాగించాలని భావిస్తోంది. దాంతో.. కేంద్ర ప్రభుత్వానికి సీఎం చంద్రబాబు లేఖ రాశారు. నీరభ్ కుమార్ ప్రసాద్ సీనియార్టీ ప్రకారం సీఎస్ ముందే కావాల్సి ఉందనీ.. కానీ గత ప్రభుత్వ హయాంలో జవహర్‌రెడ్డిని సీఎస్‌గా నియమించారని ప్రస్తుత ప్రభుత్వం పేర్కొంది.
అయితే.. టీడీపీ కూటమి ప్రభుత్వం సీనియార్టీకి ప్రాధాన్యం ఇస్తూ నీరభ్ కుమార్‌ను సీఎస్‌గా నియమించింది. సీనియార్టీలో ముందున్న నీరభ్ కుమార్ ప్రసాద్‌కు ఇప్పుడు అవకాశం దక్కినట్లు అయ్యింది. కాగా.. నీరభ్ కుమార్ సర్వీసు మరో 10 రోజులు మాత్రమే ఉండటంతో మరికొంత కాలం పాటు అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో సర్వీసును పొడించాలని కేంద్రాన్ని సీఎం చంద్రబాబు కోరారు. మరి ఒకే విడతలో ఆరు నెలల పొడిగింపు ఇస్తారా లేదా అన్ని తెలియాల్సి. మూడు నెలల చొప్పున రెండుసార్లు నీరభ్ పదవీ కాలం పొడిగిస్తారా తెలియాల్సి ఉంది. సీఎం చంద్రబాబు లేఖపై కేంద్రం ఏ మేరకు స్పందిస్తుందో.