రేషన్ కార్డులు ఉన్నవారికి సీఎం చంద్రబాబు శుభవార్త
ఏపీలో రేషన్ కార్డులు ఉన్నవారికి సీఎం చంద్రబాబు నాయుడు గుడ్‌న్యూస్ చెప్పారు.
By Srikanth Gundamalla Published on 6 Aug 2024 7:30 AM ISTరేషన్ కార్డులు ఉన్నవారికి సీఎం చంద్రబాబు శుభవార్త
ఏపీలో రేషన్ కార్డులు ఉన్నవారికి సీఎం చంద్రబాబు నాయుడు గుడ్‌న్యూస్ చెప్పారు. సోమవారం జిల్లా కలెక్టర్ల సదస్సులో పాల్గొన్న ఆయన.. పలు కీలక ప్రకటనలు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకున్న చర్యలతో కందిపప్పు ధర 40 రోజుల్లో రెండు శాతం తగ్గిందని అన్నారు. రాఊ వ్యాప్తంగా ఇకపై రేషన్ షాపులకు రాలేని వారికి మాత్రమే ఇంటికెళ్లి రేషన్ ఇవ్వాలని సీఎం చంద్రబాబు సూచించారు. అంతేకాదు.. రేషన్ షాపుల్లో రాగులు, జొన్నలు, సజ్జలు కూడా అందించాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు. మిల్లెట్లను ప్రమోట్ చేయాలని చెప్పారు. సెప్టెంబర్ నెల నుంచి పంచదార పంపిణీ కూడా ప్రారంభించబోతున్నట్లు సీఎం చంద్రబాబు చెప్పారు. అలాగే 6వేల మంది రేషన్ డీలర్ల నియామకాలను భర్తీ చేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. ధాన్యం సేకరణకు కొత్త విధానం తెస్తామన్నారు.
ఇంటింటికీ రేషన్ బండి అంటూ వాహనాలు పెట్టారని చంద్రబాబు చెప్పారు. కానీ.. వాటిల్లో రేషన్ తీసుకోవాలంటే రోడ్డు మీదకు వచ్చి అందరూ గంటల తరబడి లైన్లో నిల్చోవాల్సిన పరిస్థితి ఉండేదన్నారు. గతంలో ప్రజలు ఎప్పుడు కావాలంటే అప్పుడు, వాళ్ళ ఫ్రీ టైంలో డీలర్ దగ్గరకు వెళ్లి రేషన్ సరుకులు తెచ్చుకునే వాళ్లని గుర్తు చేశారు. కాన్నీ దాన్నంతా గత ప్రభుత్వం రివర్స్ చేసిందంటూ విమర్శలు చేశారు. ఆ బండి వచ్చే దాకా వీళ్ళు పనులు మానుకుని ఇంట్లో ఉండాల్సిన పరిస్థితి కొనసాగిందన్నారు. అవే వాహనాలు వాడి, బియ్యం రీసైక్లింగ్ స్కాం చేశారని.. ఇవన్నీ కరెక్ట్ చేయాల్సిన అవసరం ఉందన్నారు సీఎం చంద్రబాబు. రేషన్ సరకుల సరఫరా కోసం రూ.1,800 కోట్లతో కొన్న వాహనాలు, డ్రైవర్లు నెలలో సగం రోజులు ఖాళీగా ఉంటున్నాయన్నారు. ఇదంతా అనవసరపు ఖర్చు తప్ప, వాటివల్ల కార్డుదారులకు ప్రయోజనం లేకుండా పోయిందన్నారు. అలాగే రేషన్ బియ్యం పక్కదారి పట్టిందని సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇంటింటికీ రేషన్ బండి అంటూ వాహనాలు పెట్టాడు. వాటిల్లో రేషన్ తీసుకోవాలంటే రోడ్డు మీదకు వచ్చి అందరూ గంటల తరబడి లైన్లో నిల్చోవాలి. గతంలో ప్రజలు ఎప్పుడు కావాలంటే అప్పుడు, వాళ్ళ ఫ్రీ టైంలో డీలర్ దగ్గరకు వెళ్లి రేషన్ సరుకులు తెచ్చుకునే వాళ్ళు. గత ప్రభుత్వంలో మొత్తం రివర్స్ చేశారు. ఆ… pic.twitter.com/JYRDPvu895
— Telugu Desam Party (@JaiTDP) August 5, 2024