జనసేన ఎమ్మెల్యే కారుపై దాడి, ధ్వంసం.. పవన్ సీరియస్
ఆంధ్రప్రదేశ్‌లో జనసేన ఎమ్మెల్యే కాన్వాయ్‌లోని కారుపై దాడి జరిగింది.
By Srikanth Gundamalla Published on 30 July 2024 1:02 AMజనసేన ఎమ్మెల్యే కారుపై దాడి, ధ్వంసం.. పవన్ సీరియస్
ఆంధ్రప్రదేశ్‌లో జనసేన ఎమ్మెల్యే కాన్వాయ్‌లోని కారుపై దాడి జరిగింది. ఈ సంఘటన కలకలం రేపింది. పోలవరం పార్టీ జసేన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు కాన్వాయ్‌పై దాడి చేశారు దుండగులు. రాళ్లతో గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేయడంతో కారు వెనుక భాగం ధ్వంసం అయ్యింది. అద్దాలు పూర్తిగా పగిలిపోయాయి. ఎమ్మెల్యే బాలరాజు సోమవారం రాత్రి బర్రిలంకలపాడు నుంచి జీలుగుమిల్లి వెళ్తున్న సమయంలో జరిగింది ఈ ఘటన. అయితే..ఈ దాడి తర్వాత ఎమ్మెల్యే బాలరాజు ఒక వీడియో విడుదల చేశారు. తాను దాడికి గురైన కారులో లేను అని చెప్పారు. తాను సురక్షితంగా ఉన్నట్లు చెప్పారు. నియోజకవర్గంలోని ప్రజలు, అభిమానులు ఎలాంటి ఆందోళన చెందొద్దని కోరారు. ఇక ఈ ఘటనపై దర్యాప్తు చేసి.. నిందితులను పట్టుకోవాలని పోలీసులను ఎమ్మెల్యే బాలరాజు కోరారు. కేసు నమోద చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
నేను క్షేమం గానే ఉన్నాను - పోలవరం ఎమ్మెల్యే @chirri_balaraju గారు pic.twitter.com/Ncwb8I2Mk3
— JSP Naresh (@JspBVMNaresh) July 29, 2024
ఎమ్మెల్యే బాలరాజు వాహనంపై దాడి సంఘటనపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. దాడి ఘటనను స్పందిస్తున్నట్లు చెప్పారు. దాడి సమయంలో బాలరాజు కారులో లేకపోవడం వల్ల ప్రమాదం తప్పిందన్నారు. ఈ ఘటనకు కారకులైన వారిని వదిలిపెట్టొద్దని పోలీసులను ఆదేశించారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. ఇలాంటి దాడులకు దిగడం దారుణమని ఆయన పేర్కొన్నారు.
పోలవరం ఎమ్మెల్యే శ్రీ చిర్రి బాలరాజు గారి వాహనంపై చోటు చేసుకున్న రాళ్ళ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాము. కొద్దిసేపటి క్రితం బర్రింకలపాడు గ్రామంలో కొందరు వ్యక్తులు ఈ దాడికి పాల్పడ్డారు. దాడి సమయంలో ఎమ్మెల్యే శ్రీ బాలరాజు గారు వాహనంలో లేకపోవడం వల్ల ఎలాంటి హాని జరగలేదు. ఈ ఘటనకు…
— JanaSena Party (@JanaSenaParty) July 29, 2024
మరోవైపు పోలవరం జనసేన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు సామాన్యుడిలా మాస్కు పెట్టుకుని కేఆర్‌పురం ఐటీడీఏ కార్యాలయానికి తనిఖీకి వెళ్ళారు. ఆఫీసు సమయంలో ఉద్యోగి సాయి కుమార్ పని వదిలేసి తాపీగా పజ్జీ గేమ్ ఆడుకుంటూ కూర్చున్నారు. ఈ విషయాన్ని గమనించిన ఎమ్మెల్యే.. ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేసి సస్పెండ్ చేయాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. ఈ నేపథ్యంలోనే దాడి జరిగి ఉంటుందని పలువురు అనుమానిస్తున్నారు. మరి పోలీసులు దర్యాప్తులో నిందితులను పట్టుకుంటామని చెబుతున్నారు.