నేటి నుంచి రెండు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. శుక్రవారం ఉదయం గం.9.46 నిమషాలకు సభ కొలువు తీరనుంది. ఈ మేరకు గవర్నర్ అబ్దుల్ నజీర్ నోటీఫికేషన్ జారీ చేశారు. ఇవాళ ప్రొటెం స్పీకర్‌గా నియమితులైన గోరంట్ల బుచ్చయ్య చౌదరి కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల చేత సభలో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఇంగ్లీష్ అక్షరాల వరుసక్రమంలో సభ్యుల ప్రమాణ స్వీకారం జరుగుతుంది. రెండో రోజు సభ్యులు స్పీకర్‌ను ఎన్నుకుంటారు.
ఈ సమావేశాలకు స్థలాభావంతో సందర్శకులకు అనుమతి ఇవ్వలేదు. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ నుంచి 135 మంది, జనసేన నుంచి 21, వైసీపీ నుంచి 11 మంది, బీజేపీ నుంచి 9 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. అయితే ప్రతిపక్ష హోదా కూడా దక్కకపోవడంతో మాజీ సీఎం జగన్ సాధారణ సభ్యుడిగానే ప్రమాణం చేస్తారు. కాగా ఈ సమావేశాలకు మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వస్తారా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది.