స్కూళ్లు, కాలేజీలకు సంక్రాంతి సెలవులు ఇలా..
తెలుగు రాష్ట్రాల్లో విద్యా సంస్థలకు సంక్రాంతి సెలవుల సీజన్ వచ్చేసింది. స్కూళ్లకు రేపటి నుంచి 18వ తేదీ వరకు సెలవులు ఇచ్చారు.
By అంజి Published on 8 Jan 2024 8:00 AM ISTస్కూళ్లు, కాలేజీలకు సంక్రాంతి సెలవులు ఇలా..
తెలుగు రాష్ట్రాల్లో విద్యా సంస్థలకు సంక్రాంతి సెలవుల సీజన్ వచ్చేసింది. ఆంధ్రప్రదేశ్‌లో అకడమిక్ క్యాలెండర్ ప్రకారం.. స్కూళ్లకు రేపటి నుంచి 18వ తేదీ వరకు సెలవులు ఇచ్చారు. 19న పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. ఈ మేరకు జిల్లా విద్యా శాఖాధికారులు ఆదేశాలిచ్చారు. అయితే 19, 20 వ తేదీల్లో కూడా లీవ్ తీసుకుంటే.. తర్వాత రోజు ఆదివారం రానుంది. ఇలా మొత్తం 13 రోజులు సంక్రాంతికి సలవులు రానున్నాయి.కాలేజీలకు 11 నుంచి 17 వరకు సెలవులు ఉండే అవకాశం ఉంది.
తెలంగాణలో పాఠశాలలకు 12 నుంచి 17 వరకు, జూనియర్ కాలేజీలకు 13 నుంచి 16 వరకు సెలవులు ఉండనున్నాయి. జనవరి 17 న కాలేజీలు తిరిగి తెరవబడతాయి. శనివారం తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ (టీఎస్ బీఐఈ) సెలవులు ప్రకటించింది.
ప్రభుత్వ, ప్రైవేట్ ఎయిడెడ్, అన్ ఎయిడెడ్, కో-ఆపరేటివ్, టిఎస్ రెసిడెన్షియల్, సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్, ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్, మోడల్ స్కూల్స్, బిసి వెల్ఫేర్, కెజిబివిలు మరియు ఇన్సెంటివ్ జూనియర్ కాలేజీలతో సహా వివిధ రకాల కాలేజీలకు సెలవు వర్తిస్తుంది. సంక్రాంతి సెలవుల్లో తరగతులు నిర్వహించరాదని, ఉల్లంఘనలకు పాల్పడితే తగు చర్యలు తీసుకుంటామని కళాశాల యాజమాన్యాలకు ఆదేశాలు జారీ చేశారు.
హైదరాబాద్, ఇతర తెలంగాణ జిల్లాల్లోని పాఠశాలలకు జనవరి 12 నుండి 17 వరకు ఆరు రోజుల సంక్రాంతి సెలవులు ఉంటాయి. విరామం తర్వాత, పాఠశాలలు ఫార్మేటివ్ అసెస్‌మెంట్ 4కి సిద్ధమవుతాయి. రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలలు, కళాశాలలకు సంక్రాంతి సెలవులు, జనవరి 25న హజ్రత్ అలీ పుట్టినరోజు (ఐచ్ఛికం), జనవరి 26న రిపబ్లిక్ డే సాధారణ సెలవుగా ప్రకటించింది. జనవరి 26న, హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని ఇతర జిల్లాల్లోని విద్యాసంస్థలు సెలవుదినాన్ని పాటించే ముందు ఉదయం భారత జెండాను ఎగురవేస్తాయి.