చనిపోయాక కూడా మీ గుండెల్లో ఉండడానికే నాకు అధికారం ఇవ్వండి

మోసం చేయడానికే చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తాడు.. ప్రజలను మోసం చేయడానికే చంద్రబాబుకు అధికారం కావాలి.

By Medi Samrat
Published on : 10 March 2024 6:30 PM IST

చనిపోయాక కూడా మీ గుండెల్లో ఉండడానికే నాకు అధికారం ఇవ్వండి

మోసం చేయడానికే చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తాడు.. ప్రజలను మోసం చేయడానికే చంద్రబాబుకు అధికారం కావాలి. తనకు మాత్రం ప్రజల గుండెల్లో ఉండడానికే ముఖ్యమంత్రి పదవి కావాలి. ప్రజలకు మేలు చేసి.. చనిపోయాక కూడా మీ గుండెల్లో ఉండడానికే అధికారం ఇవ్వాలని సీఎం జగన్ సిద్ధం సభలో కోరారు. ఎన్నికలు రాగానే రంగు రంగుల మేనిఫెస్టోతో చంద్రబాబు నాయుడు వస్తారని.. అలాంటివి నమ్మకండని కోరారు.

ఎన్నికల కురుక్షేత్రంలో శ్రీకృష్ణుడి పాత్ర మీది.. అర్జునుడి పాత్ర తనదని సీఎం జగన్ అన్నారు. జమ్మి చెట్టుపై ఇన్నాళ్లు దాచిన ఓటు అనే అస్త్రాన్ని పెత్తందార్ల పై ప్రయోగించాలన్నారు. చంద్రబాబులా నాకు నటించే పొలిటికల్ స్టార్ క్యాంపెయినర్లు లేరు.. అబద్ధాలకు రంగులు పూసే ఎల్లో మీడియా తనకు లేదన్నారు. ప్రజలే నా స్టార్ క్యాంపెయినర్లని తెలిపారు. పేదల భవిష్యత్ పై దాడి చేసేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తారని తెలిపారు.రాష్ట్రాన్ని అన్యాయంగా విడదీసిన పార్టీలు బాబుతో ఉన్నాయి.. మనతో నేరుగా తలపడే దమ్ము లేక ఢిల్లీకి వెళ్లి పొత్తులు పెట్టుకున్నారన్నారు సీఎం జగన్. ఇంటింటికి జగన్ చేసిన అభివృద్ధి చంద్రబాబుకు భయం పుట్టిస్తోందని అన్నారు.

Next Story