కృష్ణా నది నుంచి పురాతనమైన విష్ణు విగ్రహం, శివలింగం లభ్యమయ్యాయి. కర్ణాటకలోని రాయచూర్ జిల్లాలోని కృష్ణా నదిలో ఇవి బయటపడ్డాయి. జిల్లాలోని దేవసుగూర్ గ్రామ సమీపంలో నదిపై వంతెన నిర్మాణ పనుల్లో శతాబ్దాల నాటి హిందూ దేవుళ్ల విగ్రహాలు బయటపడ్డాయి. రోడ్డు పనుల్లో నిమగ్నమైన సిబ్బంది నదిలో విగ్రహాలను సురక్షితంగా వెలికితీసి వెంటనే స్థానిక అధికారులకు సమాచారం అందించారు.
బయటపడిన విగ్రహాలలో శ్రీకృష్ణుడి దశావతారం, శివలింగం ఉన్నాయి. ఈ విగ్రహంలో అనేక లక్షణాలు ఉన్నాయని చెబుతూ ఉన్నారు. , ఈ శిల్పంలో మత్స్య, కూర్మ, వరాహ, నరసింహ, వామన, రామ, కృష్ణ, బుద్ధుడు, కల్కిలతో సహా విష్ణువుకు సంబంధించిన పది అవతారాల ప్రాతినిధ్యం ఉందని ప్రాచీన చరిత్ర, పురావస్తు లెక్చరర్ డాక్టర్ పద్మజా దేశాయ్ ఇండియా టుడేతో అన్నారు. విగ్రహం నిలబడి ఉన్న భంగిమ ఆగమశాస్త్రాలలో నిర్దేశించిన మార్గదర్శకాలకు కట్టుబడి ఉందన్నారు.