టీడీపీ ఫ్లెక్సీలు తగలబెట్టేశారు.. అనంతపురం అర్బన్ లో అసలు ఏమి జరుగుతోంది.?

తెలుగుదేశం పార్టీ తాజాగా పెండింగ్‌లో ఉన్న అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించింది.

By Medi Samrat  Published on  29 March 2024 1:31 PM GMT
టీడీపీ ఫ్లెక్సీలు తగలబెట్టేశారు.. అనంతపురం అర్బన్ లో అసలు ఏమి జరుగుతోంది.?

తెలుగుదేశం పార్టీ తాజాగా పెండింగ్‌లో ఉన్న అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఎంపీ అభ్యర్థులలో ఒంగోలు అభ్యర్థి మాగుంట శ్రీనివాసుల రెడ్డి తప్ప మిగిలిన ముగ్గురు కొత్త వ్యక్తులే. ఎమ్మెల్యే అభ్యర్థిగా అనంతపురం అర్బన్‌ దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్‌ ను టీడీపీ అధిష్టానం ప్రకటించింది. అయితే ఎన్నో సంవత్సరాలుగా ఆశలు పెట్టుకున్న ప్రభాకర్ చౌదరి వర్గం ఈ నిర్ణయాన్ని జీర్ణించుకోలేకపోతోంది. పలు తెలుగుదేశం పార్టీ కార్యక్రమాల్లో చాలా కష్టపడింది తామేనని.. అలాంటప్పుడు వేరే వారికి ఇప్పుడు సీటు ఎలా కేటాయిస్తారంటూ ప్రభాకర్ చౌదరి వర్గం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.

అర్బన్ సీటును ప్రభాకర్ చౌదరికి కాకుండా దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్‌కు కేటాయించడంతో అసంతృప్తి భగ్గుమంది. ప్రభాకర్ చౌదరి వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. Anantapur urban TDP office attacked చేశారు. కార్యాలయంలోని ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. కార్యాలయం కిటికీలు పగులగొట్టారు. బ్యానర్లు, ఫెక్సీలు, చంద్రబాబు ఫొటోలను తగులబెట్టారు. ప్రసాద్‌కు సహకరించమని.. ప్రభాకర్ చౌదరికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ప్రభాకర్ చౌదరి ఫ్యామిలీ కంటతడి పెట్టుకుంది.

Next Story