Anakapalle: బంగారు గొలుసు కోసం వృద్ధురాలిపై హత్యాయత్నం
ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ కేబుల్ టెక్నీషియన్ వృద్ధురాలిని ఆమె ఇంట్లోనే టవల్‌తో గొంతు నులిమి హత్య చేసేందుకు ప్రయత్నించాడు.
By అంజి Published on 30 Jan 2024 11:00 AM ISTAnakapalle: బంగారు గొలుసు కోసం వృద్ధురాలిపై హత్యాయత్నం
ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ కేబుల్ టెక్నీషియన్ బంగారు గొలుసు దొంగిలించాలనే ఉద్దేశంతో గత వారం వృద్ధురాలిని ఆమె ఇంట్లోనే టవల్‌తో గొంతు నులిమి హత్య చేసేందుకు ప్రయత్నించాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులో వచ్చింది. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ వీడియోలో వ్యక్తి మహిళ కూర్చున్నప్పుడు ఆమె మెడకు టవల్ చుట్టి, ఆపై ఆమెను చంపే ప్రయత్నంలో ఆమె గొంతు నులిమి చంపినట్లు చూపబడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గవరపాలెం పార్కు సెంటర్ వద్ద నివసిస్తున్న కర్రి లక్ష్మీ నారాయణమ్మ టీవీ ప్రసారాల కోసం కేబుల్ ఆపరేటర్ గోవింద్‌కు ఫోన్ చేశారు.
ఈ క్రమంలోనే ఇంటికి వచ్చిన కేబుల్ టెక్నీషియన్ 67 ఏళ్ల మహిళ బంగారు గొలుసును దొంగిలించేందుకు ప్రయత్నించాడు. వృద్ధురాలు ఒంటరిగా ఉన్నట్లు గుర్తించి ఆమె మెడకు తువ్వాలును బిగించాడు. దీంతో వృద్ధురాలు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. చనిపోయిందని అనుకుని ఆమె ఒంటిపై ఉన్న 8 తులాల బంగారు నగలు దోచుకుని అక్కడి నుంచి పరారయ్యాడు. కొంత సమయం కొంత సమయం తరవాత ఆమె కుమార్తె, అల్లుడు ఇంటికి వచ్చారు. అపస్మారక స్థితిలో పడి ఉన్న ఆమెను చూసి హుటాహుటిన స్థానిక ఆస్పత్రికి తరలించారు.
జనవరి 26వ తేదీ సాయంత్రం 7:30 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఇదంతా సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యింది. దాడి తర్వాత, కుటుంబ సభ్యుల ఫిర్యాదు ఆధారంగా భారతీయ శిక్షాస్మృతి (IPC) సెక్షన్లు 307 (హత్య ప్రయత్నం), 394 (దోపిడీకి పాల్పడి స్వచ్ఛందంగా గాయపరచడం) కింద కేసు నమోదు చేయబడింది. ఘటన జరిగినప్పటి నుంచి పరారీలో ఉన్న నిందితుడు గోవింద్ సోమవారం ఉదయం పోలీసులకు లొంగిపోయినట్లు బాధితురాలి కుమారుడు కిషోర్ తెలిపారు.