Anakapalli: ఫార్మా సిటీలోని మరో ఫ్యాక్టరీలో ప్రమాదం.. నలుగురికి తీవ్ర గాయాలు

అనకాపల్లిలో జిల్లాలోని ఫార్మా సిటీలోని మరో ఫ్యాక్టరీలో ప్రమాదం జరిగింది. సినర్జిన్ యాక్టివ్ ఇన్ గ్రేడియంట్స్ సంస్ధలో గురువారం అర్థరాత్రి దాటిన తర్వాత భారీ పేలుడు జరిగింది.

By అంజి
Published on : 23 Aug 2024 10:00 AM IST

accident, factory, Pharma City, Anakapalli district, APnews

Anakapalli: ఫార్మా సిటీలోని మరో ఫ్యాక్టరీలో ప్రమాదం.. నలుగురికి తీవ్ర గాయాలు

అనకాపల్లిలో జిల్లాలోని ఫార్మా సిటీలోని మరో ఫ్యాక్టరీలో ప్రమాదం జరిగింది. రెండు రోజుల కిందట ఎసెన్షియా ఫార్మా కంపెనీలో జరిగిన ఘోర ప్రమాదంలో 17మంది ప్రాణాలు కోల్పోయిన ఘటన మరువక ముందే మరో ప్రమాదం జరగడం కలకలం రేపుతోంది. తాజాగా జవహర్ లాల్ నెహ్రూ ఫార్మా సిటీలో ఉన్న సినర్జిన్ యాక్టివ్ ఇన్ గ్రేడియంట్స్ సంస్ధలో గురువారం అర్థరాత్రి దాటిన తర్వాత భారీ పేలుడు జరిగింది. ఈ ఘటనలో నలుగురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదం పై జిల్లా అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడారు.

అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు సీఎం. బాధితులకు అందుతున్న వైద్యంపై ఆరా తీశారు. మెరుగైన వైద్యం అందించేందకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. హోంమంత్రి, ఇతర ఉన్నతాధికారులను వెంటనే బాధితుల వద్దకు వెళ్లాలని ఆదేశించారు. ప్రమాదంలో నలుగురు కార్మికులకు తీవ్ర గాయాలు కాగా ప్రైవేటు ఆసుపత్రిలో ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. గాయపడిన నలుగురు కార్మికులు జార్ఖండ్ వాసులుగా గుర్తించారు. ఘటనపై, బాధితులకు అందుతున్న సాయంపై తనకు ఎప్పటికప్పుడు సమాచారం పంపాలని అధికారులను సీఎం ఆదేశించారు.

Next Story