AP కేడర్ కు కేటాయింపు ఉత్తర్వులను సవాలు చేసిన IAS అధికారులు

ఆంధ్రప్రదేశ్ కేడర్‌ లో పని చేయాలంటూ డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ (డిఓపిటి) నిర్ణయాన్ని సవాల్ చేస్తూ నలుగురు ఐఎఎస్ అధికారులు వాకాటి కరుణ, వాణీ ప్రసాద్, ఆమ్రపాలి కాటా, సృజన గుమ్మళ్ల సోమవారం సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ (క్యాట్)ని ఆశ్రయించారు.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  14 Oct 2024 9:22 PM IST
AP కేడర్ కు కేటాయింపు ఉత్తర్వులను సవాలు చేసిన IAS అధికారులు

ఆంధ్రప్రదేశ్ కేడర్‌ లో పని చేయాలంటూ డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ (డిఓపిటి) నిర్ణయాన్ని సవాల్ చేస్తూ నలుగురు ఐఎఎస్ అధికారులు వాకాటి కరుణ, వాణీ ప్రసాద్, ఆమ్రపాలి కాటా, సృజన గుమ్మళ్ల సోమవారం సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ (క్యాట్)ని ఆశ్రయించారు. డిఓపిటి తీర్పులను తోసిపుచ్చి తెలంగాణలో తమ సేవలను కొనసాగించేలా చేయాలని నలుగురు ఐఎఎస్ అధికారులో వేర్వేరుగా విజ్ఞప్తి చేశారు. ఈ పిటిషన్లపై మంగళవారం విచారణ జరగనుంది. అంతకుముందు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారితో ముగ్గురు ఐఏఎస్ అధికారులు సమావేశమయ్యారు. దీనిపై విస్తృతమైన చర్చల అనంతరం క్యాట్ తలుపులు తట్టాలని నిర్ణయించారు. క్యాట్‌ను ఆశ్రయించిన నలుగురు ఐఏఎస్‌లు మహిళలే. తెలంగాణ కేడర్‌లో కొనసాగాలన్న 11 మంది ఐఏఎస్‌ల విజ్ఞప్తిని డీఓపీటీ తిరస్కరించింది. ఇప్పటికే తెలంగాణలో ఐఏఎస్ వాణీ ప్రసాద్‌తో పాటు వాకాటి కరుణ, రోనాల్డ్ రోజ్, ఆమ్రపాలి, ప్రశాంతి పనిచేస్తున్నారు. ఐపీఎస్‌ కేడర్‌ నుంచి అంజనీకుమార్‌, అభిలాష్‌ బిస్త్‌, అభిషేక్‌ మహంతిలను ఆంధ్రప్రదేశ్‌ కేడర్‌కు కేటాయించారు.

2014 విభజన ఉత్తర్వులు

సృజన, శివశంకర్‌, హరికిరణ్‌లను ఆంధ్రా కేడర్‌ నుంచి తెలంగాణకు వెళ్లాలని డీఓపీటీ ఆదేశాలు జారీ చేసింది. ఏపీ నుంచి తెలంగాణకు వెళ్లాలన్న ఎస్ఎస్ రావత్, అనంతరాము అభ్యర్థనలను కూడా డీఓపీటీ రద్దు చేసింది. దీంతో వీరిద్దరూ ఏపీ క్యాడర్‌లో కొనసాగుతున్నారు. విభజన తర్వాత 2014లో కేంద్రం అఖిల భారత సర్వీసు అధికారులైన ఐఏఎస్‌, ఐపీఎస్‌లను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల మధ్య విభజించింది. కొందరు అధికారులు కేంద్రం ఆదేశాలకు విరుద్ధంగా పనిచేస్తున్నారు. దీనికి సంబంధించి డీఓపీటీ తాజా ఉత్తర్వులు జారీ చేస్తూ అధికారులు తమకు కేటాయించిన సొంత కేడర్‌లోనే కొనసాగాలని సూచించింది. దీన్ని 2014లో క్యాట్‌లోని కొందరు అధికారులు సవాలు చేయగా.. 2016లో క్యాట్‌ అధికారులకు అనుకూలంగా తీర్పునిచ్చింది. దీంతో 2017లో క్యాట్‌ తీర్పును సవాల్‌ చేస్తూ డీఓపీటీ తెలంగాణ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. మార్చి 2023లో విచారణ చేపట్టిన న్యాయస్థానం, అధికారుల అభ్యర్థనను పరిశీలించేందుకు 2024 మార్చి 21న దీపక్ ఖండేకర్ ఏక సభ్య కమిషన్‌ను ఏర్పాటు చేసింది. ఈ మేరకు ఐఏఎస్, ఐపీఎస్ అభ్యర్థనలను పరిశీలించారు. తర్వాత వారి అభ్యర్థనలను తిరస్కరించారు. కమిటీ సిఫార్సుల మేరకు కేంద్రం మరోసారి ఉత్తర్వులు జారీ చేసింది. అక్టోబరు 16లోగా APలో నివేదిక ఇవ్వాలని కూడా ఆదేశించింది. అయితే DoPT ఆదేశాలను సవాలు చేస్తూ చాలా మంది అధికారులు CATని ఆశ్రయించారు.

Next Story