అమిత్ షా తిరుపతి పర్యటన రద్దు
Amith Shah Tirupati Tour Cancelled. కేంద్ర హోంమంత్రి అమిత్ షా తిరుపతి పర్యటన రద్దు అయ్యింది. మార్చి నెలలో దక్షిణాది
By Medi Samrat Published on 1 March 2021 7:40 AM GMTకేంద్ర హోంమంత్రి అమిత్ షా తిరుపతి పర్యటన రద్దు అయ్యింది. మార్చి నెలలో దక్షిణాది రాష్ట్రాల సీఎంల సదస్సుకు అమిత్ షా హాజరుకావాల్సి ఉండగా అకస్మాత్తుగా పర్యటన రద్దు అయ్యింది. ఈనెల 4, 5 తేదీల్లో దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశాన్ని నిర్వహించాలని అనుకున్నారు. దానికి సంబంధించి తమిళనాడు, కేరళ, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సమాచారం వెళ్లింది. అయితే అకస్మాత్తుగా అమిత్‌షా తిరుపతి పర్యటన రద్దు అయ్యింది. ముఖ్యమంత్రుల సమావేశం రద్దు అయినట్లు కొద్దిసేపటి క్రితమే అధికారిక ప్రకటన వెల్లడైంది. అమిత్ షా పర్యటన రద్దుపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
అమిత్ షా ఈ నెల 4వ తేదీన తిరుపతికి రాబోతోన్నారని.. ప్రస్తుతం ఆయన తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో విస్తృతంగా పర్యటిస్తున్న ఆయన తిరుపతిని సందర్శించబోతున్నారని బీజేపీ వర్గాలు ప్రచారం చేస్తూ వస్తున్నారు. తిరుమల శ్రీవారిని దర్శించిన.. అనంతరం బీజేపీ రాష్ట్రశాఖ నాయకులు సోము వీర్రాజు, ఎమ్మెల్సీ పీఎన్వీ మాధవ్, ఇతర నేతలతో భేటీ అవుతారని అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా జరుగుతూ వచ్చాయి. అలాగే తిరుపతి ఉప ఎన్నికపై సమీక్ష నిర్వహిస్తారనే ప్రచారం కూడా సాగింది. కానీ అమిత్ షా తిరుపతి పర్యటన రద్దవ్వడం ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ-జనసేనకు పెద్ద మైనస్ అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.