అమిత్ షా ఆంధ్రప్రదేశ్ పర్యటన వాయిదా

Amit Shah's visit to Andhra Pradesh postponed. కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆంధ్రప్రదేశ్ పర్యటన వాయిదా పడింది.

By Medi Samrat  Published on  5 Jun 2023 1:45 PM GMT
అమిత్ షా ఆంధ్రప్రదేశ్ పర్యటన వాయిదా

కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆంధ్రప్రదేశ్ పర్యటన వాయిదా పడింది. పర్యటన వాయిదా పడినట్లు బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు తెలిపారు. తొలుత నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం అమిత్ షా జూన్ 8న విశాఖకు రావాల్సి ఉందని .. అయితే అమిత్ షా పర్యటన జూన్ 11వ తేదీకి వాయిదా పడిందని సోము వీర్రాజు తెలిపారు. 11వ తేదీన విశాఖలో జరగనున్న అమిత్ షా బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. జూన్ 10వ తేదీన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తిరుపతికి రానున్నారు. తిరుపతిలో పార్టీ నేతలు ఏర్పాటు చేసిన బహిరంగసభలో ప్రసంగించనున్నారు.

ప్రధాని నరేంద్రమోదీ 9 ఏళ్ల పాలనపై నెల రోజుల పాటు నిర్వహిస్తున్న ప్రచార కార్యక్రమాల్లో భాగంగా బీజేపీ అగ్రనేతలు ఏపీలో పర్యటించనున్నారు. మొదట హోంమంత్రి అమిత్ షా, తరువాత బీజేపీ అధ్యక్షుడు నడ్డా బహిరంగసభలను ఏర్పాటు చేస్తోంది బీజేపీ. మోదీ ప్రభుత్వం సాధించిన తొమ్మిదేళ్ల విజయాలపై బహిరంగసభ ఏర్పాటు చేస్తోంది ఏపీ బీజేపీ. ఈ సభలో బీజేపీ పెద్దలు ప్రసంగించనున్నారు.


Next Story