కేంద్ర మంత్రి పెమ్మసానిపై అంబటి రాంబాబు ఫైర్..!
కేంద్ర సహాయ మంత్రి పెమ్మసానిపై మాజీ మంత్రి అంబటి రాంబాబు నిప్పులు చెరిగారు.
By - Medi Samrat |
కేంద్ర సహాయ మంత్రి పెమ్మసానిపై మాజీ మంత్రి అంబటి రాంబాబు నిప్పులు చెరిగారు. గుంటూరు శంకర్ విలాస్ బ్రిడ్జిని వైసీపీ శ్రేణులతో కలిసి పరిశీలించిన ఆయన మాట్లాడుతూ.. రైల్వే శాఖ అనుమతి లేకుండా బ్రిడ్జి పడేశారన్నారు. బాధితులకు నష్టపరిహారం ఇవ్వలేదని మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో ఇది ధర్మమేనా అని ప్రశ్నించారు. పెమ్మసానికి అవగాహన లేదని.. డబ్బుందని పెమ్మసానికి అహం.. అర్ధాంతరంగా మంత్రి అయ్యాడని ఫైర్ అయ్యారు. మేము చిరు వ్యాపారులకు అండగా ఉంటామన్నారు. తప్పు చేస్తే నిన్ను అధికారం నుంచి దించేస్తారు.. ఎన్టీరామారావునే దించారు.. నువ్వు ఎంత..? అని హెచ్చరించారు.
గుంటూరుకు పెమ్మసాని శని లాగా పట్టుకున్నాడన్నారు. కేంద్రం నిధులతో బ్రిడ్జి నిర్మాణం రూ. 97 కోట్లతో సరి చేస్తే ఒప్పుకో.. కానీ రూ. 200 కోట్లతో బ్రిడ్జి నిర్మించాలని డిమాండ్ చేశారు. బాధితులకు నష్టపరిహారం తక్షణమే ఇవ్వాలన్నారు. తెలివి తక్కువ తనం, అహంతో పని చేస్తున్నాడని ఫైర్ అయ్యారు. స్థానిక ఎమ్మెల్యేలు డమ్మీలని.. పెమ్మసాని చంద్రబాబు, లోకేష్ మనిషి అన్నారు. నష్ట పరిహారం చెల్లించమంటే అభివృద్ధిని అడ్డుకుంటున్నారనడం సరికాదన్నారు.