చేబ్రోలు కిరణ్‌ను పోషిస్తోంది నారా లోకేష్ : అంబటి

మాజీ ముఖ్యమంత్రి జగన్ భార్య భారతిపై అభ్యంత‌ర‌క‌ర‌మైన‌ వ్యాఖ్యలు చేసిన ఐటీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ ను ఏపీ పోలీసులు అరెస్టు చేశారు.

By Medi Samrat
Published on : 11 April 2025 5:58 PM IST

చేబ్రోలు కిరణ్‌ను పోషిస్తోంది నారా లోకేష్ : అంబటి

మాజీ ముఖ్యమంత్రి జగన్ భార్య భారతిపై అభ్యంత‌ర‌క‌ర‌మైన‌, అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసిన ఐటీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ ను ఏపీ పోలీసులు అరెస్టు చేశారు. చేబ్రోలు కిరణ్‌ ను పోలీసులు మంగళగిరి న్యాయస్థానంలో హాజరుపరిచారు. తొలుత మంగళగిరి రూరల్‌ పోలీస్‌స్టేషన్లో అతడికి ప్రభుత్వ వైద్యులతో పరీక్షలు నిర్వహించారు. భారీ బందోబస్తు మధ్య కోర్టుకి తరలించారు. డీఎస్పీ మురళీకృష్ణ ఆధ్వర్యంలో సుమారు 100 మంది పోలీసులు న్యాయస్థానం వద్ద మోహరించారు. కిరణ్‌ చేసిన అసభ్య వ్యాఖ్యలను టీడీపీ అధిష్ఠానం కూడా తీవ్రంగా పరిగణించింది. అతడిని తక్షణమే పార్టీ నుంచి సస్పెండ్‌ చేసింది.

చేబ్రోలు కిరణ్ ను మంత్రి నారా లోకేశ్ పోషిస్తున్నారని మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు ఆరోపించారు. వైసీపీ నేతలపై సుదీర్ఘ కాలంగా కిరణ్ అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నా ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారు. పోలీసుల అదుపులో ఉన్న మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ను కలిసేందుకు నల్లపాడు పీఎస్ కు అంబటి వచ్చారు. మాధవ్ ను గత రాత్రి పోలీసులు ఎలా ట్రీట్ చేశారో తెలుసుకునేందుకు వచ్చానని అంబటి తెలిపారు. నల్లపాడు పీఎస్ నుంచి నగరపాలెం పీఎస్ కు మాధవ్ ను తరలిస్తామని పోలీసులు చెప్పారన్నారు.

Next Story