ఆ మీడియా సంస్థలు శునకానందం పొందుతున్నాయి : అంబటి రాంబాబు

తిరుమల అన్నప్రసాదంపై తాను చేసిన వ్యాఖ్యలను కొన్ని మీడియా సంస్థలు ఉద్దేశపూర్వకంగా వక్రీకరించి ప్రసారం చేశాయంటూ వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

By -  Medi Samrat
Published on : 10 Nov 2025 7:12 PM IST

ఆ మీడియా సంస్థలు శునకానందం పొందుతున్నాయి : అంబటి రాంబాబు

తిరుమల అన్నప్రసాదంపై తాను చేసిన వ్యాఖ్యలను కొన్ని మీడియా సంస్థలు ఉద్దేశపూర్వకంగా వక్రీకరించి ప్రసారం చేశాయంటూ వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భగవంతుడిపై భక్తితో తాను చేసిన వీడియోను రాజకీయాలకు వాడుకోవడం సరైంది కాదన్నారు.

ఇటీవల తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అంబటి రాంబాబు, అనంతరం మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో భోజనం చేశారు. రుచికరంగా భోజనం ఉందంటూ ప్రశంసించారు. ఈ అనుభవాన్ని వివరిస్తూ తన యూట్యూబ్ ఛానల్‌లో ఓ వీడియోను కూడా పోస్ట్ చేశారు. తాను కేవలం "అన్నప్రసాదం చాలా బాగుంది" అని మాత్రమే అన్నానని, కానీ ఆ ఛానళ్లు మాత్రం "గతంలో కంటే ఇప్పుడు బాగుంది" అని తాను అన్నట్లుగా కొన్ని మీడియా సంస్థలు ప్రచారం చేశాయని మండిపడ్డారు. ఈ విధంగా తన ప్రశంసలను ప్రస్తుత టీటీడీ బోర్డుకు, దాని ఛైర్మన్ బీఆర్ నాయుడుకు ఆపాదిస్తూ ఆ మీడియా సంస్థలు శునకానందం పొందుతున్నాయని తీవ్రస్థాయిలో విమర్శించారు.

Next Story