తెలుగు రాష్ట్ర ప్రజలకు మాజీ మంత్రి అంబటి రాంబాబు భోగి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. గుంటూరు జిల్లా కేంద్రంలో భోగి సంబరాలు జరిగాయి. వచ్చే ఎన్నికల్లో గుంటూరు నుంచి పోటీ చేస్తున్నా.. కాబట్టి ఇక్కడ సంక్రాంతి సంబరాలను నిర్వహిస్తున్నానన్నారు. సంక్రాంతి సంబురాలు చేస్తాను.. డ్యాన్సులు చేస్తాను కాబట్టి సంబురాల రాంబాబు అంటూ గతంలో కొందరు ఎగతాళి చేశారని, అలా మాట్లాడేవాళ్లు ఆ పని చేయలేరన్నారు. మెడికల్ కాలేజీల పీపీపీని వ్యతిరేకిస్తూ జీవో కాపీలను దగ్ధం చేశారు అంబటి రాంబాబు. ప్రభుత్వ రంగంలోనే మెడికల్ కాలేజీలు కొనసాగాలి. ఆ జీవోను ఉపసంహరించుకునేంత దాకా మా పోరాటం కొనసాగుతుందని చెప్పారు. ఇక ఎప్పటిలాగే డ్యాన్స్ తో ఇరగదీశారు అంబటి రాంబాబు.