Video : వివాహ వేడుకలో విషాదం.. స్నేహితుడికి గిప్ట్‌ ఇస్తూ వేదికపైనే..

ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లాలో వివాహ వేడుక విషాదంగా మారింది. తన స్నేహితుడికి గిప్ట్‌ ఇస్తుండగా వేదికపైనే కుప్పకూలిన వ్యక్తి గుండెపోటుతో మృతి చెందాడు

By Medi Samrat  Published on  22 Nov 2024 10:00 AM IST
Video : వివాహ వేడుకలో విషాదం.. స్నేహితుడికి గిప్ట్‌ ఇస్తూ వేదికపైనే..

ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లాలో వివాహ వేడుక విషాదంగా మారింది. తన స్నేహితుడికి గిప్ట్‌ ఇస్తుండగా వేదికపైనే కుప్పకూలిన వ్యక్తి గుండెపోటుతో మృతి చెందాడు. బెంగుళూరుకు చెందిన అమెజాన్ ఉద్యోగి వంశీ, వేదికపై ఉన్న జంటను పలకరించి, బహుమతిని అందజేస్తున్నప్పుడు ఈ సంఘటన చోటు చేసుకుంది. వంశీ తన స్నేహితుడి పెళ్లి కోసం బెంగళూరు నుంచి కర్నూలులోని పెనుముడ గ్రామానికి వచ్చాడని అతడి స్నేహితులు తెలిపారు.

పెళ్లి కొడుకు గిఫ్ట్ రేపర్‌ని తెరవడం ప్రారంభించడంతో, వంశీ తన బ్యాలెన్స్ కోల్పోవడం ప్రారంభించాడు. అతని పక్కన నిలబడి ఉన్న వ్యక్తులు అతన్ని పట్టుకున్నారు. వంశీని వెంటనే ధోన్‌ సిటీ ప్రభుత్వాసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. ఊహించని విషాదంతో పెళ్లి మండపం మూగబోయింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది.


Next Story