అమరావతి ఓఆర్‌ఆర్‌కు కేంద్రం గ్రీన్‌సిగ్నల్..
రాజధాని అమరావతిని దేశంలోని అనేక జాతీయ రహదారులతో అనుసంధానం చేసే ఓఆర్‌ఆర్‌కు కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. తా
By Knakam Karthik
అమరావతి ఓఆర్‌ఆర్‌కు కేంద్రం గ్రీన్‌సిగ్నల్..
రాజధాని అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి అడుగులు పడ్డాయి. రాజధాని అమరావతిని దేశంలోని అనేక జాతీయ రహదారులతో అనుసంధానం చేసే ఓఆర్‌ఆర్‌కు కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. తాజాగా ఔటర్ రింగ్ రోడ్డుకు ఆమోదం తెలుపుతూ.. కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ క్రమంలో 189.9 కిలో మీటర్ల మేర అలైన్‌మెంట్‌కు ఓకే చెప్పింది. 5 జిల్లాల ఎన్టీఆర్, ఏలూరు, కృష్ణా, గుంటూరు, పల్నాడు పరిధిలోని 23 మండలాలు, 121 గ్రామాల మీదుగా రోడ్డు నిర్మాణం జరగనుంది. త్వరలోనే భూసేకరణకు నోటిఫికేషన్ ఇవ్వనుంది. ORRలో 2 బ్రిడ్జిలు, 78 అండర్ పాస్‌లు, 65 వంతెనలు నిర్మిస్తారు.
ఈ క్రమంలో విజయవాడ తూర్పు బైపాస్ అవసరం లేదని తేల్చి చెప్పింది. దానికి ప్రత్యామ్నాయంగా రెండు లింక్ రోడ్ల నిర్మాణానికి అవకాశం కల్పిస్తూ నిర్ణయించింది. హైదరాబాద్‌లో గచ్చిబౌలి వైపు నుంచి ORRకి అనుసంధానం ఉన్న విధంగానే.. చెన్నై-కోల్‌కతా నేషనల్ హైవేలో విజయవాడ బైపాస్ మొదలయ్యే కాజా నుంచి తెనాలి సమీపంలోని నందివెలుగు వరకు 17 కిలో మీటర్ల మేర ఆరు వరుసల అనుసంధాన రహదారిని నిర్మించుకున్నారు. దీని కోసం మూడు ఎలైన్‌మెంట్లను నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) సిద్ధం చేసి, రాష్ట్ర ప్రభుత్వానికి పంపింది. గుంటూరు బైపాస్‌లో బుడంపాడు నుంచి నారాకోడూరు వద్ద ORR వరకు నాలుగు వరుసలుగా రహదారిని విస్తరిస్తారు.