టీడీపీ అధినేత చంద్రబాబు అంటే గౌరవం ఉందని.. నా భావజాలానికి టీడీపీ కుదరలేదు. అందుకే 2019 ఎన్నికల ముందు టీడీపీ నుంచి బయటికి వచ్చానని చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ అన్నారు. ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమారుడు జగన్ పార్టీ వైసీపీ కావటంతో నేను వైసీపీలోకి వెళ్ళానని తెలిపారు. నాకు, జగన్‌కు ఏటువంటి గ్యాప్ లేదు.. నాకు వైసీపీలో సముచిత స్థానం కల్పించారని తెలిపారు. వైసీపీ అధిష్టానం నన్ను పర్చూరు నుంచి పోటీచేయమన్నారు.. నాకు చీరాల అయితే బెస్ట్ అనుకున్న.. కొద్ది రోజులుగా అందుకే చీరాల నియోజకవర్గ ప్రజలతో మమేకమైన.. అయినప్పుడు కాంగ్రెస్ పార్టీకి వెళ్ళమని చాలా మంది సూచించారు. క్లిష్ట పరిస్థితుల్లో కాంగ్రెస్ లోకి వెళ్తున్నానన్నారు.
5 రోజుల క్రితం వైసీపీకి రాజీనామా చేశానని.. వైసీపీ, టీడీపీకి సమాన దూరం పాటిస్తానని పేర్కొన్నారు. ఆటో గుర్తుతో పోటీ చేయాలనుకున్న.. కేంద్ర ఎన్నికల సంఘం రద్దు ఆటో గుర్తును రద్దు చేసిందన్నారు. స్థానిక ఎంఎల్ఏ కరణం బలరాం, ఆయన తనయుడు వెంకటేష్ వైసీపీలో చేరి చీరాలలో విద్వంసం సృష్టించారని ఆరోపించారు. కరణం కుటుంబంను చీరాల నుంచి ఎప్పుడు పంపాలా అని జనం ఎదురు చూస్తున్నారు. చీరాలలో కరణం బలరాం పీఏ పేరుతో ఇసుక దోపిడీ చేశారన్నారు. పోలీసులను అడ్డు పెట్టుకుని కరణం బలరాం చీరాలలో కొజ్జా రాజకీయాలు చేశారని అన్నారు. కరణం బలరాం ఊరుకో ఏజెంట్ ను నియమించి ఇసుక, రేషన్ దోపిడీ చేశారని సంచలన ఆరోపణలు చేశారు.