అంబటి రాయుడు జనసేనలో చేరబోతున్నారా.?

వైసీపీలో చేరిన పది రోజుల్లోనే ఆ పార్టీని వీడిన మాజీ క్రికెటర్ అంబటి రాయుడు జనసేనలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి.

By Medi Samrat
Published on : 10 Jan 2024 10:46 AM

అంబటి రాయుడు జనసేనలో చేరబోతున్నారా.?

వైసీపీలో చేరిన పది రోజుల్లోనే ఆ పార్టీని వీడిన మాజీ క్రికెటర్ అంబటి రాయుడు జనసేనలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్‌ను కలిసేందుకు మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు.

అంబటి రాయుడు కొన్నాళ్ల కిందట క్రికెట్ కు వీడ్కోలు పలికాక, రాజకీయాలపై ఆసక్తి ప్రదర్శించారు. ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వానికి అనుకూలంగా ట్వీట్లు చేశారు. వైసీపీ కూడా గుంటూరు ఎంపీ స్థానంలో అంబటి రాయుడు పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. కానీ ఊహించని విధంగా రాయుడు వైసీపీకి దూరమయ్యాడు. రాయుడు తాను దుబాయ్ లో జరిగే ఇంటర్నేషనల్ టీ20 లీగ్ లో పాల్గొంటున్నానని, ఆ లీగ్ లో పాల్గొనేవాళ్లు రాజకీయాల్లో ఉండకూడదన్న నిబంధన ఉందని, అందుకే రాజీనామా చేయాల్సి వచ్చిందని ఓ ట్వీట్ చేశాడు. ఇంతలో అంబటి రాయుడు జనసేనాని పవన్ కళ్యాణ్ ను కలవడం ఊహించని పరిణామంగా మారింది.

Next Story