తిరుమలలో పనిచేసే వారందరూ హిందువులై ఉండాలి: బీఆర్‌ నాయుడు

శ్రీ వేంకటేశ్వరుడు కొలువైన తిరుమలలో పనిచేసే వారంతా హిందువులే ఉండాలని తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) బోర్డు ఛైర్మన్‌గా నూతనంగా నియమితులైన బిఆర్ నాయుడు గురువారం అన్నారు.

By అంజి  Published on  1 Nov 2024 4:41 AM GMT
Tirumala, Hindus, TTD Chairman BR Naidu, APnews

తిరుమలలో పనిచేసే వారందరూ హిందువులై ఉండాలి: బీఆర్‌ నాయుడు 

శ్రీ వేంకటేశ్వరుడు కొలువైన తిరుమలలో పనిచేసే వారంతా హిందువులే ఉండాలని తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) బోర్డు ఛైర్మన్‌గా నూతనంగా నియమితులైన బిఆర్ నాయుడు గురువారం అన్నారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఇతర మతాలకు చెందిన సిబ్బందితో ఎలా వ్యవహరించాలి, ఇతర ప్రభుత్వ శాఖలకు పంపాలా లేక వీఆర్‌ఎస్ (స్వచ్ఛంద పదవీ విరమణ పథకం) ఇవ్వాలా అనే అంశాలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో మాట్లాడతానని చెప్పారు.

''తిరుమలలో పనిచేసే ప్రతి ఒక్కరూ హిందువులే కావాలి.. అదే నా మొదటి ప్రయత్నం. ఇందులో చాలా సమస్యలు ఉన్నాయి.. దాన్ని మనం పరిశీలించాల్సి ఉంటుంది'' అని ఆయన అన్నారు. వెంకటేశ్వర స్వామి భక్తుడైన బీఆర్‌ నాయుడు మాట్లాడుతూ.. టీటీడీ బోర్డు చైర్మన్‌గా తనను నియమించడం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. తనకు బోర్డు సారథ్య బాధ్యతలు అప్పగించినందుకు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి ఎన్‌ చంద్రబాబు నాయుడుతో పాటు రాష్ట్ర ఎన్‌డిఎ ప్రభుత్వంలోని ఇతర నేతలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

గత వైఎస్ఆర్ కాంగ్రెస్ హయాంలో తిరుమలలో అనేక అక్రమాలు జరిగాయని ఆరోపించిన బీఆర్ నాయుడు ఆలయ పవిత్రతను కాపాడాలన్నారు. తన విధుల నిర్వహణలో నిజాయితీ, పారదర్శకతతో పని చేస్తానని కూడా చెప్పారు. బీఆర్‌ నాయుడు ఒక హిందూ భక్తి ఛానెల్‌తో సహా తెలుగు టీవీ ఛానెల్‌లను నడుపుతున్న మీడియా వ్యక్తి.

తిరుమల తిరుపతిలోని ప్రసిద్ధ బాలాజీ ఆలయాన్ని నిర్వహించే తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బుధవారం 24 మంది సభ్యులతో కొత్త బోర్డును ఏర్పాటు చేసింది. కొత్తగా ఏర్పాటైన టీటీడీ బోర్డుకు చైర్మన్‌గా బీఆర్ నాయుడును ప్రభుత్వం నియమించగా, భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ సహ వ్యవస్థాపకురాలు సుచిత్రా ఎల్లా సభ్యులుగా ఉన్నారు.

Next Story