ఇఫ్తార్ విందుకు ఏర్పాట్లు పూర్తి

All set for iftar to be hosted by AP govt. పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు

By Medi Samrat  Published on  27 April 2022 8:07 AM GMT
ఇఫ్తార్ విందుకు ఏర్పాట్లు పూర్తి

పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు (బుధవారం) ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఇఫ్తార్ విందును నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తిచేసింది. స్టేడియంలో ఏర్పాట్లను కలెక్టర్‌ ఎస్‌ ఢిల్లీరావుతో కలిసి డిప్యూటీ సీఎం, మైనార్టీ శాఖ మంత్రి అంజాత్‌బాషా, ఎమ్మెల్సీలు తలశిల రఘురాం, ఎండీ రుహుల్లా, లేళ్ల అప్పిరెడ్డి, ఎమ్మెల్యేలు వెలంపల్లి శ్రీనివాసరావు, మల్లాది విష్ణులు పరిశీలించారు.

ఈ సందర్భంగా అంజాత్‌బాషా మాట్లాడుతూ.. ఇఫ్తార్‌ విందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరవుతార‌ని తెలిపారు. ముస్లిం సోదరులు పెద్ద ఎత్తున తరలిరావాలని కోరారు. ఎనిమిది వేల మంది ముస్లిం సోదరులకు పాస్ లు ఇస్తామని చెప్పారు. మైనార్టీ సోదరుల ఇఫ్తార్ విందు కోసం రాష్ట్రప్ర‌భుత్వం రూ.80 లక్షలు మంజూరు చేసింద‌ని తెలిపారు. ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. విజయవాడ వన్‌టౌన్‌లో రూ.15 కోట్లతో నిర్మించిన ముసాఫిర్ ఖానాను సీఎం ప్రారంభిస్తారని తెలిపారు. ఈ కార్య‌క్ర‌మంలో మున్సిపల్ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, సబ్ కలెక్టర్ జి సూర్యసాయి ప్రవీణ్ చంద్, వైఎస్సార్సీపీ విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ దేవినేని అవినాష్ పాల్గొన్నారు.

Next Story