భూమన కరుణాకర్ రెడ్డికి అలిపిరి పోలీసుల నోటీసులు

టీటీడీ మాజీ చైర్మన్, వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డికి అలిపిరి పోలీసులు నోటీసులు జారీ చేశారు.

By -  Medi Samrat
Published on : 17 Sept 2025 6:48 PM IST

భూమన కరుణాకర్ రెడ్డికి అలిపిరి పోలీసుల నోటీసులు

టీటీడీ మాజీ చైర్మన్, వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డికి అలిపిరి పోలీసులు నోటీసులు జారీ చేశారు. తిరుపతిలోని అలిపిరి సమీపంలో శ్రీమహావిష్ణువు విగ్రహం నిర్లక్ష్యానికి గురైందంటూ భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో టీటీడీపై అసత్య ప్రచారం చేస్తున్నారని ఆయనపై అలిపిరి పోలీసులు కేసు నమోదు చేశారు. తిరుపతి డీఎస్పీ కార్యాలయానికి విచారణకు హాజరుకావాలని నోటీసులు జారీ చేశారు.

పోలీసుల నోటీసులపై భూమన కరుణాకర్ రెడ్డి స్పందించారు. సెప్టెంబర్ 23వ తేదీన తాను విచారణకు హాజరవుతానని పోలీసులకు భూమన కరుణాకర్ రెడ్డి స్పష్టం చేశారు. తిరుమల పుణ్యక్షేత్రంలో ఘోర అపచారం జరిగిందని భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. తిరుమల కొండకు భక్తులు కాలినడకన వెళ్లే అలిపిరి పాదాల వద్ద శ్రీమహావిష్ణువు విగ్రహాన్ని టీటీడీ నిర్లక్ష్యంగా పడేసిందన్నారు. మలమూత్రాలు, మద్యం బాటిళ్ల సమీపంలో నిర్లక్ష్యంగా శ్రీ మహావిష్ణువు విగ్రహాన్ని పడేశారని ఆయన ఆరోపించారు. హైందవ ధర్మాన్ని తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నారని భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. ఈ విగ్రహాన్ని చూస్తుంటే కన్నీళ్లు వస్తున్నాయని తెలిపారు.

Next Story