ప్రయాణికులకు అలర్ట్‌.. పలు రైళ్లు రద్దు.!

Alert to passengers.. South Eastern Central Railway has canceled many trains. ఆధునికీకరణ పనుల కొనసాగుతున్న నేపథ్యంలో సౌత్ ఈస్ట్రన్ సెంట్రల్ రైల్వే పలు రైళ్లను రద్దు చేసింది.

By -  అంజి
Published on : 5 Sept 2022 8:57 AM IST

ప్రయాణికులకు అలర్ట్‌.. పలు రైళ్లు రద్దు.!

ఆధునికీకరణ పనుల కొనసాగుతున్న నేపథ్యంలో సౌత్ ఈస్ట్రన్ సెంట్రల్ రైల్వే పలు రైళ్లను రద్దు చేసింది. మరికొన్ని రైళ్లను దారి మళ్లీంచగా, మరికొన్ని రైళ్లను ఆలస్యంగా నడపనుంది. లఖోలి-రాయపూర్‌ మధ్య రెండో లైన్‌ పనులు, నయా రాయపూర్‌ స్టేషన్‌, యార్డులో ఆధునీకరణ పనులు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే పలు రైళ్లను రద్దు చేయడంతో పాటు మరికొన్నింటిని దారి మళ్లీంచారు. ఈ విషయాన్ని ప్రయాణికులు గమనించి సహకరించాలని సీనియర్‌ డీసీఎం కోరారు.

ఈనెల 11న విశాఖ-కోర్బా(18518), 12న కోర్బా-విశాఖ(18517), 6 నుంచి 12 వరకు విశాఖ-దుర్గ్‌(18530), 7 నుంచి 13 వరకు దుర్గ్‌-విశాఖ(18529) రైళ్లను రద్దు చేశారు. ఈ నెల 6 నుంచి 12 వరకు విశాఖ-రాయపూర్‌(08528), 7 నుంచి 13 వరకు రాయపూర్‌-విశాఖ(08527) రైళ్లను మహాసముండ-రాయపూర్‌-మహాసముండ స్టేషన్ల మధ్య రద్దు చేశారు.

ఈ నెల 8, 11 తేదీల్లో తిరుపతి-బిలాస్‌పూర్‌(17482), 10, 13 తేదీల్లో బిలాస్‌పూర్‌-తిరుపతి(17481), ఈ నెల 6, 8, 9, 10, 13, 15 తేదీల్లో పూరీ-అహ్మదాబాద్‌(12843), 8, 10, 11, 12, 15 తేదీల్లో అహ్మదాబాద్‌-పూరీ(12844) రైళ్లను టిట్లాఘర్‌, సంబల్‌పూర్‌, జార్సుగూడ మీదుగా దారి మళ్లించారు.

ఈ నెల 12న విశాఖ- కోర్బా (18518) ఎక్స్‌ప్రెస్‌ 5 గంటలు.., 8, 15 తేదీల్లో విశాఖ-నిజాముద్దీన్‌(12897) సమతా ఎక్స్‌ప్రెస్‌ 2 గంటలు.., 12న హజ్రత్‌ నిజాముద్దీన్‌-విశాఖ(12808) సమతా ఎక్స్‌ప్రెస్‌ 5 గంటలు, 15న తిరుపతి-బిలాస్‌పూర్‌(17482) 4 గంటలు, విశాఖ-భగత్‌ కీ- కోఠి (18573) 5 గంటలు ఆలస్యంగా బయలు దేరుతాయి.

Next Story